
దీపావళి పండుగను భారతదేశమంతా పెద్ద ఎత్తున జరుపుకుంటుంది. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించుకుంటారు. ఐశ్వర్యానికి అధిదేవత అయిన లక్ష్మీదేవిని పూజిస్తే మన ఇంట ధనధాన్యాలకు లోటుందని నమ్మకం. అందుకే ప్రతి ఇంటా దీపావళి రోజున లక్ష్మీదేవిని పూజిస్తారు. ఇక దీపావళి పండుగను ప్రదోష అమావాస్య రోజున జరుపుకుంటాం కాబట్టి ఆ రోజునే దీపావళి పండుగను జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు. ఇక ఈ దీపావళి పండుగను ప్రతి ఏటా ఐదు రోజుల పాటు జరుపుకుంటూ ఉంటాం.
ధన్‌తేరాస్‌తో మొదలై దీపావళి పండుగ అన్నా చెల్లెళ్ల పండుగతో ముగుస్తుంది. ఈ సంవత్సరం త్రయోదశి తిథి అక్టోబర్ 29 బుధవారం వచ్చింది కాబట్టి ఆరోజున ధన్ తేరాస్ నిర్వహించుకుంటాం. ఆ రోజు నుంచే దీపావళి పండుగ ప్రారంభమవుతుంది. అక్టోబరు 31వ తేదీ గురువారం ఛోటీ దీపావళి అంటే నరక చతుర్దశిని.. నవంబర్ 1వ తేదీన దీపావళిని జరుపుకుంటాం. గోవర్ధన్ పూజ మర్నాడు జరుపుకోనుండగా… అన్నా చెల్లెళ్ళ పండగను 03 నవంబర్ 2024 సోమవారం జరుపుకోవాలని సూచించారు. ఇక దీపావళి పండుగనాడు ఆయుష్మాన్ యోగం, స్వాతి నక్షత్రం కలయిక జరిగింది. అందుకే ఈ దీపావళి మరింత స్పెషల్.
