ఇవాళ మహిళలంతా వరలక్ష్మీ వ్రతం జరుపుకుంటున్నారు. ఈ వ్రతం జరుపుకోవడమనేది చాలా కాలంగా ఆనవాయితీగా వస్తోంది. వరలక్ష్మీ వ్రతం చేసుకుంటే ఆర్థిక కష్టాలు తీరడంతో పాటు కుటుంబం సుఖ సంతోషాలతో ఉంటుందని నమ్మకం. వరలక్ష్మీ వ్రతం చేస్తున్న వారు ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి వ్రత మండపాన్ని ఏర్పాటు చేసుకుని పిండితో ముగ్గువేసి కలశాన్ని ప్రతిష్టించుకోవాలి. ఆపై అమ్మవారి చిత్ర పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఏర్పటు చేసుకుని పూజ చేయాలి. ఇది మనందరికీ తెలిసిన విషయమే ఇప్పటికే చెప్పుకున్నాం.
అయితే వరలక్ష్మీ వ్రతం చేసే వారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. తప్పుప్పొలను తెలుసుకోవాలి. ఈ వ్రతం ఆచరించే వారు నియమ, నిష్టలతో పూజ చేస్తుంటారు. ఆ తరుణంలో తెలిసో తెలియకో కొన్ని తప్పులు దొర్లుతుంటాయి. అవి ముందుగానే తెలుసుకుంటే జాగ్రత్త పడవచ్చు. వరలక్ష్మీ వ్రతం నాడు కలశాన్ని ఏర్పాటు చేసుకున్న వారు, ఆ కలశాన్ని గాజు ప్లేట్లలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. వరలక్ష్మీ వ్రత కలశాన్ని వెండి ప్లేట్ లో కానీ లేదంటే రాగి ప్లేట్లలో కానీ పెట్టాలి. పూజను తొలుత గణపతితో మొదలు పెట్టాలి. ముందుగా పసుపు గణపతిని చేసి పూజించుకున్న తర్వాతే లక్ష్మీదేవిని పూజించాలి.