
కేదార్నాథ్ ఆలయం గురించి ఇప్పటికే కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ ఆలయం 10వ శతాబ్దంలో భూమిపై ఉండి ఉంటే.. అది తక్కువ ‘ఐస్ ఏజ్’ కాలంలో ఉండేదని శాస్త్రవేత్తలు ఊహిస్తున్నారు. డెహ్రాడూన్‌లోని ‘వాడియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ జియాలజీ’ కేదార్నాథ్ దేవాలయంలోని రాళ్లపై లిగ్నోమాటిక్ డేటింగ్ టెస్ట్ చేసింది. రాళ్ల వయసును గుర్తించేందుకు దీనిని నిర్వహిస్తారు. దానిలో 14వ శతాబ్దం నుంచి 17వ శతాబ్దం మధ్యకాలం వరకు ఆలయం పూర్తిగా మంచుతో కప్పబడి ఉందని పరీక్షలో తేలింది. అయితే ఆలయ నిర్మాణానికి మాత్రం ఎలాంటి నష్టమూ జరగలేదు.
2013లో కేదార్‌నాథ్‌ను వరద ముంచెత్తింది. ఆ సమయంలో సగటు కంటే 375% ఎక్కువ వర్షపాతం నమోదైంది. ఆ వరదల్లో ఎంతో మంది మరణించారు. చాలా గ్రామాలు దెబ్బతిన్నాయి. భారత వైమానిక దళం రంగంలోకి దిగి 1 లక్షా 10 వేల మందికి పైగా ప్రజలను రక్షించి విమానాల్లో సేఫ్ ప్లేస్‌కు తరలించింది. అంతా అతలాకుతలం అయింది. కానీ ఇంత విపత్కర వరదలో కూడా కేదార్నాథ్ ఆలయ నిర్మాణం చెక్కుచెదరలేదు. ఆ వరదలు తగ్గిన తరువాత చూస్తే… 1200 సంవత్సరాల తరువాత ఆ ప్రాంతంలో దాదాపుగా ప్రతిదీ తుడుచుకుపెట్టుకు పోయింది. అక్కడ ఏ ఒక్క నిర్మాణం కూడా నిలబడలేదు. కానీ ఆలయం మాత్రం కొంచెం కూడా దెబ్బతినలేదు. ఈ ఆలయం ఇంత స్ట్రాంగ్‌గా ఉండటానికి నిర్మాణమే కారణమని చెబుతారు.
