శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ జరిగిందంటూ వస్తున్న వార్తలు దేశ వ్యాప్తంగా ఉన్న హిందువుల నుంచి మంటలు రగిలిస్తున్నాయి. తాజాగా ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకులు సద్గురు దీనిపై స్పందించారు. తిరుపతి ప్రసాదంలో బీఫ్ టాలో ఉందన్న వార్త అసహ్యాన్ని కలిగించిందని.. హిందూ దేవాలయాన్ని భక్తులు నిర్వహించాలి కానీ ప్రభుత్వాలు కాదన్నారు. భక్తులకు ఇచ్చిన ప్రసాదంలో జంతు కొవ్వు కలిసి ఉండడం మహాపరాధమని ఆయన పేర్కొన్నారు. గుడులపై ప్రభుత్వాల పెత్తనాన్ని విడనాడాలని డిమాండ్ చేశారు.
తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై సద్గురు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ X వేదికగా స్పందించారు. “గొడ్డు కొవ్వు కలిసిన ప్రసాదాన్ని హిందూ భక్తులు తినేలా చేయడం అసహ్యాన్ని కలిగించింది. అందుకే దేవాలయాలు ప్రభుత్వ పాలనలో కాకుండా భక్తులే స్వయంగా నడపాలి. భక్తి లేని చోట పవిత్రత ఉండదు. హిందూ దేవాలయాలు ప్రభుత్వ పరిపాలన ద్వారా కాకుండా భక్తులైన హిందువులు నిర్వహించబడమే మంచిది.” అని సద్గురు పేర్కొన్నారు. ఈ అంశంపై ఓ వైపు ప్రజల నిరసనలు, మరోవైపు రాజకీయ పార్టీలు సైతం పెద్ద ఎత్తున ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి.