
జూలై మాసంలో శ్రీవారిని దర్శించుకున్న 22.13 లక్షల మంది భక్తులు దర్శించుకున్నారని టీటీడీ ఈవో జే శ్యామలరావు వెల్లడించారు. హుండీ ద్వారా శ్రీవారికి రూ.125కోట్ల 35లక్షలను భక్తులు సమర్పించారు. కోటి నాలుగు లక్షల లడ్డులను భక్తులకు విక్రయించామని తెలిపారు. 24.04 లక్షల మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారన్నారు. 8.67 లక్షల మంది భక్తులు తలనీలలు సమర్పించారని తెలిపారు. శ్రీవాణి ట్రస్టు టికెట్లను కుదించామని.. అన్నప్రసాదంలో భక్తులకు రుచికరమైన ప్రసాదాన్ని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
అన్నప్రసాదంలో యంత్రాలను త్వరలోనే మారుస్తామన్నారు. తిరుమలలో అత్యాధునిక ల్యాబ్ ను ఏర్పాటు చేస్తామని టీటీడీ ఈవో జే శ్యామలరావు తెలిపారు. దళారీలను అరికట్టడంలో భాగంగా పదే.. పదే టిక్కెట్లు పొందుతున్న 40 వేల మంది ఐడీలను బ్లాక్ చేశామన్నారు. తిరుమలలోని హోటల్ నిర్వాహకులు.. నిపుణులతో ట్రైనింగ్ ఇప్పిస్తామన్నారు. ప్రసాదాల తయ్యారికీ వినియోగించేందుకు నాణ్యమైన నెయ్యిని కోనుగులు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలరావు వెల్లడించారు. తిరుత్తణిలో టీటీడీ భూమి అన్యాక్రాంతం పై చర్యలు తీసుకుంటామని ఈవో తెలిపారు.
