తెల్లవారుజామునుంచే తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు

వైకుంఠ ఏకాదశి హిందువులకు పెద్ద పండుగ. ఈ రోజున భక్తులంతా వైకుంఠ ద్వార దర్శనం చేసుకునేందుకు తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్నారు. ఈ రోజున మహావిష్ణువు తన వాహనమైన గరుడిపై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడట. కాబట్టి ప్రసిద్ధ వైష్ణవ దేవాలయాలతో సహా తిరుమల తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వరుని ఆలయంలోనూ వైకుంఠ ద్వార దర్శనం అవకాశాన్ని కల్పిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే ఉత్తర ద్వార దర్శనం ప్రారంభమైంది. తెల్లవారుజాము నుంచే స్వామివారిని భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.

నిన్న జరిగిన తొక్కిసలాటలో భక్తులు ఆరుగురు మరణించడంతో పాటు పదుల సంఖ్యలో గాయపడటంతో అలర్ట్‌ అయిన టీటీడీ.. వైకుంఠ ఏకాదశికి పకడ్భందీగా ఏర్పాట్లు చేసింది. ఎలాంటి అవాంచనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంది. ఏడుకొండల్ని ఇప్పటికే అద్భుతంగా తీర్చిదిద్దింది. తిరుమల మొత్తం లైటింగ్‌ను అద్భుతంగా ఏర్పాటు చేసింది. పూలతో శ్రీవారి ఆలయంతో పాటూ చుట్టుపక్కల ఆలయాల్ని అత్యంత సుందరంగా అలంకరించారు. శుక్రవారం తెల్లవారుజామున నాలుగున్నర నుంచే భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. ఉత్తర ద్వారానికి వైకుంఠ ద్వారమని పేరు. ఇది ఉత్తరాయణ పుణ్యకాల ప్రవేశానికి సంకేతం.

Share this post with your friends