స్వర్ణకాంతులతో మెరిసిపోతున్న ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయం

ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయం స్వర్ణ కాంతులతో ధగధగా మెరిసిపోతోంది. శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోతున్నారు. స్వర్ణ కాంతుల నడుమ అంతరాలయంలో ఉన్న స్వామివారు సైతం మెరిసిపోతున్నారు. స్వామివారిని చూడడానికి రెండు కళ్ళు చాలటం లేదని భక్తులు చెబుతున్నారు. అత్యంత భక్తిశ్రద్ధలతో స్వామిని దర్శించి తమ మొక్కుబడులు తీర్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చిన్న వెంకన్న ఆలయంగా ప్రసిద్ధి చెందింది. అసలు ద్వారకా తిరుమల ఆలయానికి కొత్తగా వచ్చిన శోభేంటో తెలుసుకుందాం.

ఇటీవల చిన్న వెంకన్న అంతరాలయ గోడలకు బంగారు తాపడాన్ని చేయించారు. స్వామివారి గర్భాలయం స్వర్ణ కాంతులతో మెరిసిపోతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన దీపక్ నెక్జెన్ ఫీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బంగారు తాపడాన్ని చేయించింది. ఏకంగా రూ.1.64 కోట్ల ఖర్చుతో బంగారు తాపడాన్ని చేయించారు. ఆ బంగారు తాపడాన్ని ఇటీవల చిన్న వెంకన్న గర్భాలయంలో గోడలకు అలంకరించారు. దాంతో స్వామివారి గర్భాలయం స్వర్ణ శోభితమయింది. జిల్లా రైస్మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2021లో రూ.98.31 లక్షల వ్యయంతో 264 గ్రాముల 647 మిల్లి గ్రాముల బంగారం, 147 కేజీల 641 గ్రాముల 700 మిల్లీ గ్రాముల రాగి రేకులతో ఆలయ ప్రధాన ముఖద్వారానికి, తలుపులకు, అంతరాలయ ద్వారానికి బంగారు తాపడం చేయించారు.

Share this post with your friends