
ముఖ్యమైన గ్రహాలలో ఒకటిగా జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని పరిగణిస్తారు. సూర్యుడు ప్రతి నెలా ఒక్కో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఈ నెల 17న తులారాసిలోకి ప్రవేశించాడు. దీని వలన కొన్ని రాశుల వారికి మంచి, కొన్ని రాశుల వారికి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి. మేషరాశి, కన్యారాశి, మకర రాశివారికి మంచి జరుగుతుంది.
మేషరాశి: సూర్యుడు తులారాశిలోకి ప్రవేశించడం వల్ల కొంత ప్రతికూల ఫలితాలు మేషరాశి వారికి ఎదురయ్యే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు కలగవచ్చు. భాగస్వామితో సహనంగా, ప్రశాంతంగా ఉంటే మంచిది. వృథా ఖర్చులు అయ్యే అవకాశం ఉంది.
కర్కాటకం: ఈ రాశివారికి వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా సవాళ్లు ఎదురవుతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఉద్యోగంలో పెను మార్పులు, తల్లి వైద్యానికి అధిక ధన వ్యయం వంటివి జరుగుతాయి.
తులారాశి: తులారాశిలోకి సూర్యుని ఆగమనం కాబట్టి సొంత రాశి వారికి ఇబ్బందికర పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు. సహనంతో ఉంటే సమస్యలు పరిష్కారమవుతాయి.
మీనరాశి: మీనరాశి వారికి సైతం తులా సంక్రమణం కారణంగా కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు. వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది కాబట్టి డ్రైవింగ్ సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని పండితులు సూచిస్తున్నారు. ఎవరితోనూ వాదనలు వద్దు. ప్రశాంతంగా ఉంటే వివాదాలకు దూరంగా ఉండొచ్చని పండితులు చెబుతున్నారు.
