గణేష్ చతుర్థి రోజున చేయాల్సిన, చేయకూడని పనులేంటంటే..

భాద్రపద మాసంలోని శుక్ల పక్ష చతుర్థి తిథిని వినాయక చవితిగా జరుపుకోబోతున్నాం. ఈ ఏడాది సెప్టెంబర్ 7న వినాయక చవితిని జరుపుకోనున్నాం. మరి ఈ రోజున చేయాల్సినవి.. చేయకూడని పనులేంటో చూద్దాం. ముందుగా విగ్రహ ప్రతిష్టాపనకు పవిత్ర సమయం రెండున్నర గంటల పాటు ఉండనుంది. అంటే సెప్టెంబర్ 7న ఉదయం 11:03 గంటల నుంచి మధ్యాహ్నం 1:34 గంటల మధ్య చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. వినాయక చవితి రోజున ఇంట్లో వినాయకుడి విగ్రహాన్ని ఈశాన్య మూలలో ప్రతిష్టించుకోవాలి. ఈశాన్య దిశలో వినాయకుడిని ప్రతిష్టించి పూజిస్తే చాలా మంచి జరుగుతుంది.

గణేశుడికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టమట. కాబట్టి గణేశుడిని ఎరుపు రంగు వస్త్రం మీద ప్రతిష్టించి ఆయనకు దుస్తులు కూడా ఎరుపు రంగువే ధరింపజేస్తే మంచిదట. పూజలో సైతం పువ్వులు, పండ్లు వంటివన్నీ ఎరుపు రంగువే ఉపయోగించాలట. గణేశుని పూజలు 21 రకాల పత్రి, పూలు, పండ్లు, దీపాలు, అగరుబత్తీలు, గంధం, కుంకుమ వంటివన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవాలి. అలాగే వినాయకుడికి నైవేద్యాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి.

ఇక వినాయక చవితి రోజున కొన్ని పనులు అస్సలు చేయకూడదు. గణేష్ చతుర్థి రోజున ఇంట్లో పొరపాటున కూడా సగం నిర్మించిన లేదా విరిగిన గణేశుడి విగ్రహాన్ని ప్రతిష్టించకూడదు. అలాగే పొరపాటున కూడా గణపతి పూజకు తులసి దళాన్ని , మొగలి పువ్వులను ఉపయోగించకూడదు. అలాగే తామసిక ఆహారం తీసుకోవద్దు, చంద్రుడిని చూడవద్దు.

Share this post with your friends