హిందూ మతంలో మకర సంక్రాంతిని అత్యంత వైభవంగా జరపుకుంటారు. పైగా అన్ని పండుగల్లో ఇది అతి పెద్ద పండుగ. అలాంటి మకర సంక్రాంతి రోజు పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. మకర సంక్రాంతి రోజున ఉదయాన్నే లేచి శుచిగా స్నానమాచరించాలి. ముఖ్యంగా మకర సంక్రాంతి నాడు చేసే స్నానానికి విశష్ట ప్రాధాన్యత ఉంది. అలా స్నానం చేయకుండా పొరపాటున కూడా ఆహారం తీసుకోకూడదట. ఇలా చేయడం వల్ల తిన్న ఆహారం అపరిశుభ్రంగా మారి విషపూరితంగా మారుతుందని చెబుతారు.
మకర సంక్రాంతి నాడు పొరపాటున కూడా నూనె దానం చేయకూడదట. అలా చేస్తే అశుభంతో పాటు అనారోగ్యాలు, ప్రతికూలతలు ఇంట్లోకి వస్తాయని నమ్ముతారు. మకర సంక్రాంతి రోజున తెల్ల బియ్యం, కత్తులు, కత్తెర వంటి పదునైన వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయకూడదట. మకర సంక్రాంతి రోజున తామసిక ఆహారం లేదా మద్యపానానికి దూరంగా ఉండాలి. తామసిక ఆహారం తీసుకుంటే జీవితంలో ప్రతికూలత రావడంతో పాటు ఆరోగ్యంపై కూడా చెడు ప్రభావం పడుతుందట. మకర సంక్రాంతి రోజున ఇంటి వచ్చిన పేదలకు, బ్రహ్మణులకు దానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. పొరపాటున కూడా ఎవరినీ అవమానించకూడదట.