దీపావళి పండుగ ధనత్రయోదశి లేదంటే ధన్‌తేరాస్‌తో ప్రారంభమవుతుంది. ఆరోగ్యం, సంపద, సంతోషం కోసం ఈ ధనత్రయోదశిని మనం జరుపుకుంటాం. అయితే ఈ రోజున కొన్ని వస్తువులను కొంటే మంచిదని కొంటూ ఉంటారు. కానీ కొనకూడని వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం. ఇనుముతో తయారు చేసిన వస్తువు ఏదైనా సరే పొరపాటున కూడా ధనత్రయోదశి నాడు కొనకూడదట. ఇనుము ఆర్థిక శ్రేయస్సుకు మంచిది కాదట.
నలుపు రంగు వస్తువులను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనకూడదట. ఇనుము, నలుపు రంగు శనీశ్వరుడికి సంబంధించినవని నమ్మకం కాబట్టి కొనుగోలు చేయకూడదట. దీపావళి పండుగను చీకటిపై కాంతి విజయానికి గుర్తుగా జరుపుకుంటాం కాబట్టి నలుపు రంగు వస్తువులను అస్సలు కొనకూడదట. సెకండ్ హ్యాండ్ వస్తువులను ఎట్టి పరిస్తితుల్లోనూ కొనకూడదట. నీలి రత్నాలను సైతం కొనుగోలు చేయవద్దని పండితులు సూచిస్తున్నారు. గాజు వస్తువులను లేదా విరిగిన వస్తువులను కొనుగోలు చేయకూడదట. ధనత్రయోదశి నాడు ఆయుధ సామాగ్రిని అస్సలు కొనుగోలు చేయకూడదట.