శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో అక్టోబరు 4 నుండి 12వ తేదీ వరకు భక్తుల సౌకర్యార్థం టిటిడిలోని వివిధ ట్రస్టులకు, పథకాలకు విరాళాలు అందించిన దాతలకు కేటాయించే గదులను టిటిడి రద్దు చేసింది. అదేవిధంగా అక్టోబరు 4న ధ్వజారోహణం, అక్టోబర్ 12న చక్రస్నానం జరిగే రోజుల్లో మినహా మిగతా రోజులలో దాతలను దర్శనానికి అనుమతిస్తారు. కావున దాతలు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరుతోంది.
2024-08-20