నిద్ర లేవగానే అద్దం చూస్తున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి..

ఇంట్లో ఆడవాళ్లు పొద్దున లేస్తే ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉంటారు. అయితే చేయకూడని పనులు కూడా కొన్ని ఉంటాయి. అవేంటో తెలుసుకుంటే జీవితం సాఫీగా సాగుతుంది. లేందంటే కొంతమేర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదట. అదేంటంటే.. ఆడవాళ్లు ఎంత పనైనా ఉండనివ్వండి. మొహం అద్దంలో చూసుకోవడం మాత్రం మానరు. ఏదో ఒక కారణంతో అద్దంలో పదే పదే మొహాన్ని చూసుకుంటూ ఉంటారు. ఇలా చేయడం వాస్తు శాస్త్ర ప్రకారం మంచిది కాదట. ముఖ్యంగా ఉదయాన్నే ఈ పని అస్సలు చేయకూడదట. అలా చేస్తే దుష్ఫరిణామాలు తప్పవని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

నిద్ర లేచిన వెంటనే ఆడవాళ్లు ముఖాన్ని అద్దంలో చూసుకుంటే వ్యక్తిగత జీవితంలో సమస్యలు తప్పవట. ఇలా చేయడం వలన నెగిటివ్ ఎనర్జీ పడే అవకాశం ఉంటుందట. తత్ఫలితంగా మానసిక సమస్యలు, కోపం, చిరాకు, ఆరోగ్యం దెబ్బతినడం, ఆత్మస్థైర్యం కోల్పోవడం వంటి సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. లేవగానే అద్దంలో ఆడవాళ్లు ముఖాన్నిచూసుకోవడం కారణంగా వారిలో ఉండే శక్తినంతటినీ అద్దం లాగేసుకుంటుందట. దీంతో రోజంతా యాక్టివ్‌నెస్ పోయి వీక్‌గా అయిపోతారట. కాబట్టి ఉదయం లేవగానే అద్దాన్ని చూడటం మానుకోవాలి. అసలు బెడ్ రూమ్‌లో అద్దం ఉంచకపోవడమే బెటర్.

Share this post with your friends