ప్రతి ఆలయంలోనూ ఏదో ఒక సమయంలో మణిదీప వర్ణన ఉంటుంది. అసలు ఈ మణిదీప వర్ణన ఎందుకు చేస్తారో తెలుసా? అసలు ఎందుకు మణిదీప నివాసిని పూజిస్తామో తెలుసుకుందాం. ముప్పై రెండు మహా శక్తుల పరిరక్షణలో సమస్త విశ్వమూ ఉందని చెబుతారు. ఈ 32 మహా శక్తులు సొంత ఇంటితో పాటు ఐహిక సుఖాల కోసం ఈ బ్రహ్మాండమును కనురెప్పపాటులో సృష్టించి లయం చేయగలవట. అందుకే ఈ 32 శక్తులను ముప్పై రెండురకాల పూలతో, పసుపు కుంకుమలతో, నవరత్నాలతో, రాగి కంచు వెండి బంగారము మెదలగు లోహాలతో పూజిస్తారు.
అలాగే 32 నైవేద్యాలను తయారు చేసి యథాశక్తి పూజ చేసుకుంటారు. అలాగే మణిదీప నివాసినిని సుగంధ ద్రవ్యాలతో పూజించడం సంప్రదాయం. అయితే కొందరికి 32 రకాల నైవేద్యాలు చేసే శక్తి ఉండదు. అలాంటి వారు తమ శక్తి కొద్దీ నైవేద్యాలను సమర్పించుకుని పూజించుకోవచ్చు. పరాశక్తి పూజలో భక్తి ప్రధానము కానీ నైవేద్యాలు కాదని చెబుతారు. అయితే కలకండ మొదలుకొని, ఏలకులు, రకరకాల పండ్లు, కొబ్బరికాయలు కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. అయితే ఈ పూజలో రెండు రకాల పువ్వులు మాత్రం పనికి రావు. అవేంటంటే.. మొగలి పువ్వు, బంతి పువ్వు. వీటిని మాత్రం పూజలో వాడకూడదు.