శ్రావణ మాసంలో వ్రతాలను ఎందుకు చేసుకుంటామో తెలుసా?

శ్రావణమాసం తొలి శుక్రవారం కావడంతో భక్తులతో అమ్మవారి దేవాలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి. విశాఖలోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారు, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన, సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి.. అమ్మవారిని భక్తులు దర్శించుకుని కుంకుమార్చన, వరలక్ష్మి వ్రతంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇక వేదాల్లో అయితే శ్రావణాన్ని నభో మాసమని పేర్కొన్నాయి. నభం అంటే ఆకాశమని అర్థం. ఈ మాసంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి కాబట్టి ఈ మాసాన్ని ‘నభో మాసం’ అని మన పెద్దలు పిలిచేవారు. ఈ మాసంలో కొన్ని సార్లు అధిక వర్షపాతం కారణంగా ప్రకృతిలోని పంచభూత శక్తులన్నీ ప్రబలంగా మారుతాయి. మరికొన్ని సందర్భాల్లో ఇవి మరింత విపరీత పరిస్థితులను సైతం కల్పిస్తూ ఉంటాయి. అలాంటప్పుడు మనలోని రోగ నిరోధక శక్తి కొంత మేర తగ్గిపోతుంది. ఈ క్రమంలోనే జలుబు, దగ్గు, ఫ్లూ వంటి ఇతర అంటు రోగాలన్నీ విజృంభిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రకృతిలో వచ్చే మార్పులకనుగుణంగా మన శరీరాన్ని మార్చుకోవాలట. అందులో భాగంగానే మన పెద్దలు వ్రతాలను నిర్దేశించారని చెబుతారు.

Share this post with your friends