వామన జయంతి ఎప్పుడనేది తెలుసుకున్నాం. శ్రీ మహా విష్ణువు ఐదవ అవతారమే వామనావతారం అని కూడా తెలుసుకున్నాం. ఇక అసలు విష్ణుమూర్తి వామనావతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చిందో తెలుసుకుందాం? శ్రీ మహా విష్ణువు వామనావతారం దేవతలను, విశ్వాన్ని రక్షించడానికే.. ఎత్తడం జరిగింది. బలి చక్రవర్తి ఆగడాలతో దేవతల్లో ఆందోళన నెలకొంది. శక్తితో పాటే ఆయనలో క్రూరత్వం కూడా పెరిగింది. దీంతో దేవతలు, మానవులన్న తారతమ్యం లేకుండా వేధించడం మొదలు పెట్టాడు. అప్పుడు దేవతలు విష్ణుమూర్తి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. వారిని రక్షిస్తానని చెప్పి విష్ణుమూర్తి.. వామనుడిగా అదితి, ఋషి కశ్యపుల ఇంట జన్మించాడు.
బాల వటువు బ్రాహ్మణుడి రూపంలో శ్రీ మహా విష్ణువు బలి చక్రవర్తి యాగం చేస్తుండగా వెళ్లాడు. ఆ సమయంలో శుక్రాచార్యుడు కూడా అక్కడే ఉన్నాడు. వామనుడు తనకు మూడడుగుల భూమిని దానంగా కోరగా.. చిన్న పిల్లవాడి అడుగు ఎంత ఉంటుందిలే అని ఏమాత్రం ఆలోచించక బలి చక్రవర్తి అంగీకరించాడు. గురువు శుక్రాచార్యుడు హెచ్చరిస్తున్నా వినిపించుకోకుండా హామీ ఇచ్చేశాడు. దీంతో వామనుడు భారీగా ఎదిగిపోయి భూమ్యాకాశాలపై రెండడుగులూ పెట్టేసి మడో అడుగు ఎక్కడ పెట్టాలని బలిని అడిగాడు. ఎక్కడా స్థానం లేకపోవడంతో తన తలపై పెట్టించుకుంటాడు. అంతే.. బలిని శ్రీ మహా విష్ణువు పాతాళానికి తొక్కేసి దేవతలకు అతని బాధల నుంచి విముక్తి కలిగించాడు.