శ్రీకృష్ణ జన్మాష్టమిని కృష్ణాష్టమి అని ఎందుకు పిలుస్తారో తెలుసా?

శ్రీకృష్ణ జన్మాష్టమి ముఖ్యమైన హిందూ పండుగల్లో ఒకటి. శ్రీకృష్ణుడిని విష్ణుమూర్తి 8వ అవతారంగా భావిస్తూ ఉంటారు. శ్రీకృష్ణుడి జన్మదినాన్నే కృష్ణాష్టమిగా జరుపుకుంటాం. అయితే జన్మదినాన్ని కృష్ణాష్టమిగా జరుపుకోవడమేంటి? అసలు ఆ పేరు ఎందుకొచ్చిందనే సందేహం ఎప్పుడైనా మీకు వచ్చిందా? దానికి కారణం ఉంది. ముందుగానే చెప్పుకున్నాం. శ్రీకృష్ణుడు సుమారు 5వేల సంవత్సరాల క్రితం మధురలో జన్మించాడు. విష్ణుమూర్తి 8వ అవతారంగా కన్నయ్య జననం జరిగింది. అలాగే దేవకీ మాతకు అష్టమ సంతానంగా శ్రీకృష్ణుడు జన్మించాడు. అలాగే ఎనిమిదవ తేదీన పుట్టాడు.

సంస్కృతంలో జమ్నా అనే పదానికి అర్థం.. జననం. అలాగే అష్ట అంటే ఎనిమిది. శ్రావణ మాసంలో అష్టమ తిథి నాడు కృష్ణపక్షం వస్తుంది. వీటన్నింటి కారణంగా శ్రీకృష్ణుడి పుట్టిన రోజుకు కృష్ణాష్టమి అనే పేరు వచ్చింది. అయితే ఈ పండుగ సాధారణంగా అగస్ట్ లేదంటే సెప్టెంబర్ మాసంలో వస్తుంది. ఈ పండుగలో అత్యంత ముఖ్యమైన అంశం దహీ హండి. అంటే ఉట్టి కొట్టడం. ఒక పిరమిడ్‌ను ఏర్పాటు చేసి పెరుగుతో నింపిన కుండను దానిలో పెట్టి పగులకొడతారు. దీనినే దహీ హండి అంటారు. శ్రీకృష్ణుడు జన్మించిన సమయం నుంచి కృష్ణ జయంతిని అర్ధరాత్రి వరకూ జరుపుకుంటారు.

Share this post with your friends