శ్రావణ మాసంలో గోపూజ ఎందుకు చేస్తారో తెలుసా?

శ్రావణ మాసమంతా ప్రతి రోజూ ఏదో ఒక పండుగో లేదంటే శుభకార్యమో ఉంటూనే ఉంటుంది. నెలంతా సందడే సందడి. పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పండుగలు, వ్రతాలు, బోనాలు వంటి కార్యక్రమాలతో ఈ నెల మొత్తం కోలాహలంగా మారుతుంది. ఇక వ్రతాలు చేయాలనే ఆసక్తి ఉన్నవారికి అయితే ఈ నెల మరీ అనుకూకలం. మంగళగౌరీ వ్రతం, శ్రావణ శుక్రవారం వ్రతం అంటూ ప్రతి రోజూ ఏదో ఒక వ్రతం ఆచరించవచ్చు. ఎక్కువగా ఈ నెలలో లక్ష్మీదేవి అనుగ్రహం కోరుతూ పూజలు నిర్వహిస్తారు. గ్రామదేవతలకు బోనాలు చెల్లిస్తారు. కొన్ని చోట్ల గ్రామ దేవతలను ఈ నెలలోనే కొలుచుకుంటారు.

ఇక ఇవన్నీ పక్కనబెడితే శ్రావణ మాసంలో కేవలం లక్ష్మీదేవిని మాత్రమే కాకుండా గోపూజ కూడా చేయాలట. శ్రావణ మాసంలో గోమాతను పూజించుకుంటే మన కోరికలు తప్పక నెరవేరుతాయట. సాగర మథనం సమయంలో పాల సముద్రాన్ని చిలకగా లక్ష్మీదేవితో పాటు నంద, సుభద్ర, సుశీల, సురభి, బహుళ అనే 5 గోవులు కూడా వచ్చాయట. దీనిని భవిష్య పురాణం చెబుతోంది. కాబట్టి గోవులను మనం పూజిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుందట. తద్వారా అమ్మవారి కటాక్షం మనకు లభిస్తుందట. అంతేకాదు.. ఎప్పుడు గోపూజ చేసుకున్నా కూడా లక్ష్మీదేవి ఆశీస్సులు మనపై తప్పక ఉంటాయట.

Share this post with your friends