భారతదేశంలో అన్ని మతాలవారు ఉన్నారు. మత సామరస్యంతో జీవిస్తున్నారు. అయితే మన దేశంలో వరకూ హిందువులు ఎక్కువ. ఇక దేవాలయాలు ప్రతి గ్రామంలోనూ కనిపిస్తుంటాయి. దేవాలయాలు లేని రాష్ట్రమంటూ మన దేశంలో అయితే లేదు. అయితే ఏ రాష్ట్రంలో ఎక్కువ దేవాలయాలున్నాయనేదే ఆసక్తికరం. ఈ లెక్కన చూస్తే తమిళనాడులో ఎక్కువగా దేవాలయాలున్నాయి. ఈ రాష్ట్రంలో ఏకంగా 79 వేల దేవాలయాలున్నాయి.
తమిళనాడును దేవతల నిలయంగా భావిస్తూ ఉంటారు. దీనికి అక్కడ ఉన్న దేవాలయాలు కూడా ఒక కారణం. దేశంలోనే ప్రసిద్ధి గాంచిన అమ్మవారి ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. మధుర మీనాక్షి ఆలయం, తంజావూరులోని బృహదీశ్వరాలయం, కుంభకోణం, శ్రీరంగం, కంచి, తిరునల్వేలిలో ఎన్నో ప్రముఖ ఆలయాలున్నాయి. జీవితంలో హిందువులు ఒక్కసారైనా దర్శించుకోవాలనుకునే ఆలయాలు ఇక్కడ ఉన్నాయి. మైలాడుతురైలోని మయూరనాథస్వామి ఆలయం, మహాబలిపురంలోని ఏకశిలా రాతి దేవాలయాలు మన శిల్పకళా నైపుణ్యానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి.