నదీ స్నానం చాలా మంచిదని తెలుసుకున్నాం. ముఖ్యంగా గంగా నదిలో స్నానమాచరిస్తే మరింత పుణ్యమట. అది వీలుకానప్పుడు ఏదైనా నదీ స్నానం ఉత్తతమే. అయితే ఈ నదీ స్నానం ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తాన చేస్తే చాలా మంచిది. అది కాదంటే మధ్యాహ్నం 12 లోపు ఎప్పుడైనా ఆచరించవచ్చు. ఆ తరువాత చేయకుండటమే ఉత్తమం. ఇక ఏ ఏ తిథుల్లో నదీ స్నానం ఆచరిస్తే మంచిదో తెలుసా? మకర సంక్రాంతి, మహా శివరాత్రి, మాఘ మాసం, శ్రావణ మాసం, కార్తీక మాసం, కుంభ మేళా, పుష్కరాలు వంటి పవిత్ర తిథుల్లోనదీ స్నానమాచరిస్తే ఆత్మ శుద్ధితో పాటు మోక్షం కూడా లకభిస్తుందట.
ఇక ఏ ఏ నదుల్లో స్నానం చాలా గొప్పదని అంటారంటే.. గంగా, గోదావరి, కృష్ణ, నర్మదా, సింధు, కావేరి వంటి పుణ్య నదుల్లో స్నానం చేయడం చాలా మంచిదట. నదీ స్నానం కారణంగా మనం చేసిన పాపాలన్నీ పోతాయట. అలాగే జీవితం సుఖ సంతోషాలతో సాగుతుందట. నదీ స్నానానికి ఇంతటి ప్రాముఖ్యత ఉంది కాబట్టే.. అంతే పవిత్రంగా మనం ఆచరించాలట. అప్పుడే ఫలితం సంపూర్ణంగా దక్కుతుందట. ఇష్టానుసారంగా ఎలా పడితే అలా శుద్ధి లేకుండా స్నానమాచరిస్తే మాత్రం పాపాన మూటగట్టుకున్నట్టే అవుతుందని అంటారు. కాబట్టి నదీ స్నానం చేసే వారు.. నియమానుసారంగా చేయడం చాలా మంచిది.