సోమ ప్రదోషం రోజు ఏ దేవుని పూజించాలో తెలుసా?

సోమ ప్రదోష వ్రతం ఎప్పుడనేది తెలుసుకున్నాం కదా. మరి ఆ రోజున ఎవరిని పూజిస్తే సత్ఫలితం ఉంటుందో తెలుసుకుందాం. సోమ ప్రదోష వ్రతం నాడు వ్యాస మహర్షి రచించిన శివ మహా పురాణం ప్రకారం మనం శివపార్వతులను పూనజించాలి. అలా చేస్తే మనోభీష్టాలు నెరవేరుతాయని నమ్మకం. పరమేశ్వరుని పూజకు విశిష్టమైన ప్రదోష వ్రతం రోజున ఆది దంపతులైన శివపార్వతులను పూజిస్తే సుఖసంతోషాలతో జీవిస్తారని విశ్వాసం. ముఖ్యంగా సోమవారం, ప్రదోషం కలిసి వచ్చిన సోమ ప్రదోషం రోజున చేసే శివ పూజలకు ఇతర రోజుల కంటే కోటి రెట్ల అధిక ఫలం ఉంటుందని శాస్త్ర వచనం.

సోమ ప్రదోష వ్రతం చేసుకునే వారు ఆ రోజు బ్రహ్మ ముహూర్తానే నిద్ర లేచి శుచిగా స్నానమాచరించాలి. అనంతరం శివపార్వతులను మల్లెలతో పూజించాలి. ఆ రోజున ఉపవాసం చేయగలిగిన వారు ఉపవాసం చేస్తే చాలా మంచిది. ఈ పూజను ముఖ్యంగా సాయంకాలం వేళ చేస్తాం కాబట్టి సాయంత్రం వరకూ ఉపవాసం ఉండి సూర్యాస్తమయం తర్వాత శుచిగా శివపార్వతులను మల్లెలతో పూజించాలి. అనంతరం ఇంట్లో సంధ్యా దీపం వెలిగించి నమస్కరించుకోవాలి. తరువాత శివాష్టకం పఠించి ఉపవాసం విరమించాల్సి ఉంటుంది.

Share this post with your friends