బంగారం ఏ దిశలో పెట్టకూడదో తెలుసా?

బంగారం అంటే ఇష్టపడని మహిళలు ఉంటారా? కొందరైతే మార్కెట్‌లోకి కొత్త మోడల్ వచ్చిందంటే చాలు.. కొనడానికి రెడీ అవుతారు. ముఖ్యంగా శ్రావణ మాసంలో పూజలు, వ్రతాల నేపథ్యంలో మగువలంతా బంగారం కొనడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు. అక్షయ తృతీయ తరువాత బంగారం ఎక్కువగా కొనుగోలు చేసేది ఈ మాసంలో కావడం గమనార్హం. అయితే వాస్తు నిపుణులు మాత్రం.. బంగారం కొని ఇంట్ల పెడితే సరిపోదని.. అది పెట్టే ప్లేస్ కూడా సరైనదై ఉండాలని అంటున్నారు. సరైన స్థానంలో పెడితే చాలా మంచి జరుగుతుందట. సంపద, సౌభాగ్యాలు పెరుగుతాయని అంటున్నారు.

అసలు బంగారం ఏ ప్లేస్‌లో పెట్టాలంటారా? నైరుతి దిశలో బంగారు ఆభరణాలను ఉంచాలట. ఇలా ఈశాన్య దిశలో పెడితే.. బంగారం కొనుగోళ్లు కూడా పెరుగుతాయట. ఇక ఎక్కడ పెట్టకూడదో కూడా తెలుసుకోవాలి. బంగారం కానీ బంగారు ఆభరణాలు కానీ వాయువ్య మూలలో మాత్రం బంగారాన్ని అస్సలు పెట్టకూడదట. అదే విధంగా బంగారు ఉంచే గది పసుపు రంగులో ఉంటే మరింత మంచిదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే బంగారాన్ని ఎక్కువ శాతం మంది అల్మారాలో పెడుతుంటారు. ఇలా పెట్టాలనుకునేవారు అల్మారాలోని ఉత్తర దిశలో పెట్టాలి. డబ్బు కూడా ఉత్తర దిక్కులోనే పెడితే ఇంట్లో సంపద, అదృష్టం నెలకొంటుందట.

Share this post with your friends