తిరుమల శ్రీవారి లడ్డూలో ఏ కర్పూరం వాడుతారో తెలుసా?

కర్పూరం ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నాం కదా. అనేక రకాలు ఉన్నవి. వాటిలో ప్రాచీన ఆయుర్వేద గ్రంథాలలో అతి ముఖ్యమైన 13 రకాల గురించి తెలుసుకున్నాం కదా. అయితే ఈ 13 రకాలే కాకుండా కర్పూరం చెట్టు సారము, జిగురు లక్షణాన్నిబట్టి కూడా 3 రకాలుగా వర్గీకరిస్తారు. దానిలో చెట్టు పైభాగము నుంచి తీసే కర్పూరమును ‘శిరోజం’ అని పిలుస్తారు . ఇది చాలా తెల్లగా మిలమిలా మెరుస్తూ ఉంటుంది. మ్రాని మధ్యభాగములో పుట్టిన దానిని మధ్యమం అని పిలుస్తారు.. ఇది పైభాగములో ఉన్నంత తెల్లగా ఉండదు. సాధారణంగా ఉంటుంది. కొంచెం గౌరవర్ణములో ఉండును.

చెట్టు మిగిలిన భాగములలో లభ్యం అయ్యేది సాధారణముగా ఉంటుంది. ప్రస్తుతం మనకు బజారులో దొరికేది ఈ కర్పూరమే. కర్పూరం చెట్టు మధ్య మాను (కాండం) నుంచి తీసినది కొంచెం పసుపు రంగులో ఉండును. ఇది కర్పూరములన్నింటిలో ఉత్తమం. సరైన అవగాహన లేకుండా కొందరు హారతి కర్పూరమును చూపించి పచ్చ కర్పూరం అని నమ్మించే యత్నం చేస్తుంటారు. వాస్తవానికి పచ్చ కర్పూరం లేత పసుపు రంగులో ఉండి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామి వారి లడ్డు ప్రసాదం నందు ఈ పచ్చకర్పూరం విరివిగా వాడుతారు. హారతి కర్పూరం చాలా డేంజర్. ఒక్కోసారి ప్రాణాలను కూడా తీస్తుంది.

Share this post with your friends