సూర్యచంద్రుల కలయిక ఎప్పుడు జరుగుతుందో తెలుసా?

హిందూమత పరంగానూ.. జ్యోతిశాస్త్రం ప్రకారంగా ఎలా చూసినా కూడా సూర్య చంద్రులకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. సూర్య చంద్రులను శుభ గ్రహాలుగా పిలుస్తూ ఉంటాడు. సూర్యుడు ఆత్మను నియంత్రిస్తూ.. ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ ఉంటాడు. ఇక చంద్రుడు మనసుకు బాధ్యత వహిస్తాడు. అంతేకాకుండా చంద్రుడికి మారో ప్రాధాన్యత కూడా ఉంది. అదేంటంటే.. తొమ్మిది గ్రహాలలో రాశిచక్రం, నక్షత్రరాశిని అత్యంత వేగంగా మార్చే గ్రహం కావడమే. అందువల్ల చంద్రుడు ఇతర గ్రహాలతో ఎక్కువసార్లు కలుస్తూ ఉంటాడు. అంతటి ప్రాధాన్యత కలిగిన సూర్య చంద్రుల కలయిక ఈ నెలలోనే ఉండనుంది. ఈ నెలలోనే మకరరాశిలో సూర్యచంద్రుల కలయిక ఏర్పడుతోంది.

అసలు సూర్య చంద్రుల కలయిక ఎప్పుడు జరుగుతుందో తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం.. జనవరి 28 మంగళవారం మధ్యాహ్నం 2:51 గంటలకు చంద్రుడు ధనుస్సు నుంచి బయటకు వచ్చి మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటికే సూర్యుడు సైతం మకరరాశిలోనే ఉంటారు. వాస్తవానికి సూర్యుడు జనవరి 14న ఉదయం 9:03 గంటలకు మకరరాశిలోకి ప్రవేశించాడు. కాబట్టి సూర్యుడు ఫిబ్రవరి 12, 2025 రాత్రి 10:3 గంటల వరకూ ఈ రాశిలోనే ఉంటాడు. ఈ క్రమంలోనే జనవరి 28న మకరరాశిలో సూర్యచంద్రుల కలయిక ఉంటుంది. ఇది కొందరికి చాలా మంచిని కలుగజేస్తుందట.

Share this post with your friends