శనిదేవుడి జయంతి ఎప్పుడో తెలుసా?

హిందూ క్యాలెండర్ ప్రకారం ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో కూడా ఎన్నో పర్వదినాలు ఉన్నాయి. హనుమాన్ జయంతి పూర్తైంది. నెక్ట్స్ వచ్చేదేంటంటే.. శని జయంతి. వచ్చే అమావాస్య రోజున శని జన్మదినోత్సవంగా జరుపుకుంటారు. అసలు ఈ శని జయంతి ఎప్పుడో తెలుసా? ఈ నెల 27న. ఈ రోజున శనీశ్వరుడిని పూజిస్తే జీవితంలోని శని బాధలన్నీ తొలగిపోతాయి. ఇక ఇతర దేవతల మాదిరిగా కాకుండా శని జయంతిని ఆలయాల్లోనే జరుపుకుంటారు. కొన్ని ప్రఖ్యాత శని దేవుని ఆలయాలు ఉన్నాయి.

మనకు తెలిసింది.. శని సింగనాపూర్ మాత్రమే. కానీ చాలా శని దేవుని ప్రఖ్యాతిగాంచిన ఆలయాలున్నాయి. అలాంటి ఆలయాల్లో ఒకటి దేశ రాజధాని డిల్లీలో ఉంది. ఇక్కడ కొలువై ఉన్న శనిశ్వరుడిని దర్శనం చేసుకుంటే జీవితంలో ఆనందం, శ్రేయస్సుతో పాటు శాంతి లభిస్తుందని నమ్మకం. ఢిల్లీలోని ఛతర్‌పూర్ ప్రాంతంలో ఈ ఆలయం ఉంటుంది. ఇక్కడ శనీశ్వరుడి విగ్రహం ఆసక్తికరంగా నల్ల రాయితో 21 అడుగుల ఎత్తు ఉంటుంది. శని జయంతి నాడు భక్తులు ఇక్కడ ప్రత్యేక పూజలు, హవనము, అభిషేకంతో పాటు నూనె, నల్ల నువ్వులు, నీలిరంగు పువ్వులను సమర్పిస్తారు.

Share this post with your friends