వారాహి దేవి ఎలా ఉంటుందో తెలుసా?

ప్రస్తుతం వారాహి నవరాత్రులు నడుస్తున్నాయి. వారాహి అంటే ఎవరంటే.. వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి. ఆషాఢ మాసం ప్రారంహం నుంచి అమ్మవారి నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఇంచుమించు వరాహ మూర్తిని పోలిన రూపంతో నల్లని మేఘ వర్ణ శరీరంతో.. ఎనిమిది చేతులతో అమ్మవారు మనకు కనిపిస్తుంది. ఇక అమ్మవారి చేతుల్లో శంఖం, పాశము, హలము వంటి ఆయుధాలు కనిపిస్తాయి. ఇక అమ్మవారికి ఒక వాహనమంటూ ఏదీ లేదు. గుర్రం, సింహం, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద సంచరిస్తూ ఉంటుంది.

వారాహి అమ్మవారిని లలితాదేవిని సైన్యాధిపతిగా వర్ణిస్తారు. అమ్మవారిని విష్ణుమూర్తి రూపమని కూడా చెబుతారు. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడిని సంహరించిన విష్ణుమూర్తి అవతారమే వరాహమూర్తి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ, వరాహ పురాణాల ప్రకారం.. అంధకాసురుడు, రక్తబీజుడు, శుంభనిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో అమ్మవారి పాత్ర ఉందట. వారాహి దేవిని సప్త మాతృకలలో ఒకరిగా కొలుస్తారు. ఇక వారాహి అమ్మవారి నవరాత్రులను గుప్త నవరాత్రులు లేదంటే గుహ్య నవరాత్రులని కూడా చెబుతారు. ఈ నెల 6 నుంచి ప్రారంభమైన వారాహి నవరాత్రులు 15న ముగియనున్నాయి.

Share this post with your friends