గురు గ్రహ దోషాలు తొలగాలంటే ఏం చేయాలో తెలుసా?

దక్షిణామూర్తి రూపం గురించి అయితే తెలుసుకున్నాం. దుఃఖాలకు శాశ్వత నాశనాన్ని కలిగించే దాక్షిణ్యం మూర్తిగా సాక్షాత్కరిస్తే ఆ రూపమే దక్షిణామూర్తి. ఇక దక్షిణామూర్తిని ఉపాసించే వారికి ఏం జరుగుతుందో తెలుసా? వారికి బుద్ధి వికసిస్తుందట. కాబట్టి విద్యార్థులు చదువులో ఏకాగ్రత కోసం దక్షిణామూర్తిని పూజించాలట. సరస్వతీ దేవి తర్వాత విద్యాబుద్ధుల కోసం అంతగా కొలిచే మరో దేవత ఎవరైనా ఉన్నారంటే అది దక్షిణామూర్తియే. ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే జాతకరీత్యా అయితే గురు గ్రహం అనుగ్రహించాలి. అప్పుడు మాత్రమే ఐశ్వర్యం, పదవులు, రాజయోగం వంటివి పొందగలుగుతారు.

ముఖ్యంగా గురు గ్రహం వివాహ కారకుడని చెబుతారు. జాతకంలో గురువు స్థానాన్ని బట్టి జీవితంలో వివాహం జరుగుతుందట. గురు స్థానం బలీయంగా ఉన్నప్పుడే వివాహాది శుభకార్యాలు జరుగుతాయి. జాతకంలో గురు గ్రహం నీచ స్థితిలో ఉన్నప్పుడు దక్షిణామూర్తిని ఆశ్రయిస్తే సత్ఫలితాలు ఉంటాయి. సూర్యోదయం లోపే ప్రతి గురువారం లేచి శుచిగా స్నానం చేసి పూజామందిరంలో నిశ్చలంగా కూర్చోవాలి. ఆపై దక్షిణామూర్తి స్తోత్రాన్ని11 సార్లు పారాయణ చేస్తే గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇలా 40 రోజుల పాటు క్రమం తప్పకుండా చేయాలి. అలా చేస్తే.. గురు గ్రహ అనుకూలతతో విద్య, ఉద్యోగం, వివాహం, సంపద, మోక్షం వంటివి ఏం కోరకున్నా సరే తప్పక లభిస్తాయి.

Share this post with your friends