అష్టమంగళ చిహ్నాల్లో దర్పణ మండపం అంటే ఏంటో తెలుసా?

శ్రీ వైష్ణవ సంప్రదాయంలో యజ్ఞ యాగాదుల సమయంలో అష్ట మంగళ చిహ్నాలకి, మహాకుంభాభిషేకానికి ఎంతో ప్రాధాన్యత ఉందని తెలుసుకున్నాం కదా. మహాకుంభానికి చుట్టూ ఈ అష్టమంగళ చిహ్నాలను అమరుస్తారు. అవి మహా కుంభానికి చేరి, పరమాత్మలో లీనమౌతాయి.అయితే అష్ట మంగళ చిహ్నాల్లో శ్రీ వత్సము, పూర్ణకుంభం గురించి తెలుసుకున్నాం కదా. దీనిలో భాగంగా భేరీ, దర్పణ మండము, రెండు మీనాల గురించి తెలుసుకుందాం. భేరీ, నాదం వలన దుష్ట శక్తులు దరి చేరవు. భగవంతుని పూజా సమయంలో, హారతి సమయంలో పెద్ద ధ్వనితో, భేరీ మ్రోగిస్తారు. భేరీ ధ్వనులతో అమంగళం అప్రతిహతమౌతుంది.

దర్పణ మండము: దర్పణం అంటే పెద్ద అద్దం. శ్రీ మహావిష్ణువు సన్నిధిలో ఎదురుగా పెడతారు. అద్దంలో శ్రీ హరి ప్రతి బింబం కనపడుతుంది. ఆలయ సన్నిధిలో పెట్టిన అద్దంలో, శ్రీ మహావిష్ణువు తన అందం చూసుకొని మురిసేందుకు పెడతారు. అన్నీ తానే అనే తత్వం తెలపడానికి ఈ దర్పణంగా చెబుతారు.

రెండు మీనాలు: ఒకదానికొకటి సమంగా జోడిగా ఒకదానిని ఒకటి చూచుకొనే విధంగా అమర్చిన మీనాలు. మీనాలు రెండూ జీవాత్మ పరమాత్మ. మీనాలు నీళ్ళల్లో మాత్రమే నివసిస్తాయి. తీరానికి వస్తే జీవం కోల్పోతాయి. చేపలు నీటిని విడచి బయటకు రావు. అలాగే జీవాత్మ పరమాత్మల ఐక్యత తెలుపుతుంది.
మనం భగవంతుని ప్రార్ధించేటప్పుడు, మనజీవాత్మ పరమాత్మ తో ఏకమై ప్రార్ధించాలి.

Share this post with your friends