ఖజ్రానా గణేష్‌ కోసం పాల్రేచా కుటుంబం ఏం చేసిందో తెలుసా?

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ ప్రతి విషయంలోనూ ఇతర రాష్ట్రాలకు భిన్నంగా ఉంటుంది. తాజాగా అక్కడి ఓ కుటుంబం చేసిన పనితో తిరిగి ఇండోర్ వార్తల్లో నిలిచింది. ఇక్కడ శ్రీ ఖజ్రానా గణేష్ కొలువుదీరాడు. దేశంలోని ప్రసిద్ధ ఆలయాలలో ఇది ఒకటి. ఇక ఈ ఖజ్రానా గణేషుడి కోసం పాల్రేచా కుటుంబానికి చెందిన 20 మంది కలిసి 25 రోజుల పాటు శ్రామించి రాఖీని తయారు చేసి నిన్న రాఖీ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి సమర్పించారు. ఈ రాఖీ తయారీకి సామగ్రిని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించి అందంగా తయారు చేశారు. ముత్యాలు, కార్డ్‌బోర్డ్, రష్మీ నక్షత్రాలు, రత్నాలు రాఖీలో పొందుపరిచారు.

మొత్తానికి పాల్రేచా కుటుంబం తయారు చేసిన ఈ రాఖీ దేవుడికి సమర్పించిన అతి పెద్ద రాఖీగా రికార్డ్ సృష్టించనుంది. చాలా ఏళ్లుగా ఈ నగర వాసులు దేవుడికి రాఖీ కట్టడం సంప్రదాయంగా మారిపోయింది. పర్యావరణ పరిరక్షణ, దేశభక్తిని పెంపొందించేదిగా తయారు చేశారు. ఇదివరకటి కంటే భిన్నంగా ప్రత్యేకంగా ఈ రాఖీని తయారు చేశారు. అలాగే లక్షకు పైగా పూసలను ఉపయోగించారు. కైలాస పర్వతం, గోముఖ గంగ, పారిజాతం, అశోకం, ఖర్జూరం, కొబ్బరి చెట్లు, హైదరాబాదీ ముత్యాలు, అమెరికన్ వజ్రాలు, నక్షత్రాలు కల్ప వృక్షం, పురివిప్పిన నెమలి ఆకృతులను చెక్కారు. ఈ రాఖీని చూసేందుకు పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి వస్తున్నారు.

Share this post with your friends