సాయంకాలం వేళ చేయకూడని పనులేంటో తెలుసా?

మనం తెలియకుండా చేసే కొన్ని పొరపాట్లు మనలను కష్టాల్లోకి నెట్టేస్తూ ఉంటాయి. ఏం చేసినా ఫలితం దక్కదు. ముఖ్యంగా సాయం సంధ్యవేళ కొన్ని పనులు చేయకూడదని అంటారు. ఈ కొన్ని పనుల కారణంగా మన ఇంట్లో ఒడిదుడుకులు, పురగోతి లేకపోవడం, ఆర్థిక, శారీరక సమస్యల వంటివి తలెత్తుతాయట. మరి సాయంకాలం వేళ ఏ పనులు చేయకూడదో తెలుసుకుని వాటిని చేయకుంటే చాలా వరకూ మనం ఇబ్బందుల నుంచి బయట పడతాం.

ఇంట్లో సుఖశాంతులు ఉండాలని ఎవరు కోరుకోరు చెప్పండి. దాని కోసం సాయంకాలం వేళ ఆహారం, శృంగారం, నిద్ర, గోళ్లను కత్తిరించడం వంటి కార్యకలాపాలు అస్సలు నిర్వహించకూడదని చెబుతుంటారు. సాయంకాలం వేళ ఆహారం తీసుకుంటే మరు జన్మలో జంతువుగా జన్మిస్తారట. ఇక సాయంకాలం వేళ నిద్రపోతే.. ఇంట్లోని ధనమంతా మంచినీళ్ల మాదిరిగా ఖర్చైపోయి ఆర్థిక కష్టాలు చుట్టుముడతాయట. ఇక సాయంకాలం వేళ లైంగిక వాంఛలకు దూరంగా ఉండకుంటే పుట్టిన బిడ్డ ఇబ్బందులు ఎదుర్కొంటాడట. గోళ్లు కత్తిరించుకుంటే.. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయట.

Share this post with your friends