ఇంటి ముందు విఘ్నేశ్వరుడుంటే ఏం జరుగుతుందో తెలుసా?

విఘ్నాలకు అధిపతిగా వినాయకుడికి ఎంతో ప్రాధాన్యముంది. శుభకార్యం ఏదైనా సరే.. పూజ మొదలయ్యేది విఘ్నేశ్వరుడితోనే. తొలి పూజ ఆయనకే. చాలా మంది విఘ్నేశ్వరుడుని ప్రధాన ద్వారం పైనో లేదంటే.. తలుపుల మీదో చెక్కిస్తారు. అలా చెక్కించడం ఎంత వరకూ మంచిది? అసలు మంచిదేనా.. కాదా? చూద్దాం. చాలా మంది ఇంటి ముందు వినాయకుడి విగ్రహాన్నో. పటాన్నో ఏర్పాటు చేస్తారు. ఇది మంచిదేనట.. ఇలా ఉంచడం వల్ల ఏ పనికైనా అడ్డంకులు తొలగిపోయి బాగుంటుందట. పైగా చాలా మంచి జరుగుతుందని పండితులు చెబుతారు.

ఇంటి ప్రధాన ద్వారంపై ఫొటో పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి ఎలాంటి నెగిటివిటీ రాదు. ఇంట్లో అంతా పాజిటివిటీ నెలకొనడంతో పాటు వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయట. తద్వారా కుటుంబంలో గొడవలకు కూడా ఆస్కారం ఉండదట. ఇల్లాంతా ప్రశాంతంగా ఉంటుందట. అంతేకాకుండా ఏదైనా పనిపై బయటకు వెళ్లేటప్పుడు ప్రధాన ద్వారంపై ఉండే గణేష్ చిత్రపటానికి నమస్కరించుకుని వెళ్తే ఆ పని తప్పక పూర్తవుతుందట. ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తి ప్రవేశించదట. ఇంట్లోని వారి మధ్య మనస్పర్థలనేవి లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారట. కాబట్టి ఎలాంటి సంశయమూ లేకుండా ఇంటి ముందర గణేష్ చిత్రపటాన్ని పెట్టుకోవచ్చు.

Share this post with your friends