కలలో పాములు కనిపిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

కలలకు సంబంధించి చాలా విషయాలు మనకు స్వప్న శాస్త్రం చెబుతుంది. దీనిలో ప్రతి కలకూ ఓ కారణం వివరించడం జరిగింది. ప్రతి కల మన మంచి, చెడులకు ప్రతిరూపంగా పేర్కొంటారు. కొన్ని కలలు భవిష్యత్‌ను కూడా సూచిస్తాయట. ఇక మనకు కలలో ఇది వస్తుందని అయితే చెప్పలేం. జంతువులు, పక్షులు, నదులు వంటివన్నీ మనకు కలలో కనిపించవచ్చు. ఒక్కోసారి కలలో పాములు కూడా కనిపిస్తాయి. అవి మనల్ని వెంబడించడం, కాటేయడం వంటివి చూస్తాం. అయితే కలలో తెల్లపాము కానీ నల్లపాము కానీ కనిపిస్తే దాని అర్థం ఏంటో తెలుసుకుందాం.

కలలో నల్లటి పామును కనిపిస్తే మనకు మంచి జరుగుతుందట. అది ఎలా అయినా కనిపించవచ్చు. నల్లపాము కనిపిస్తే ఇంట్లో శుభకార్యమో లేదంటే ఆర్థిక వృద్ధి, జీవితంలో ఆనందం, శ్రేయస్సు వంటివి జరుగుతాయట. కలలో తెల్లపాము కనిపించడం మాత్రం మంచిది కాదని చెబుతారు. కలలో తెల్ల పాము మనకు ఎలా కనిపించినా కూడా అది అశుభమేనట. మనకు లేనిపోని ఇబ్బందులు ఎదురవుతాయట. జీవితంలో ప్రతికూల ప్రభావాన్ని ఈ తెల్ల పాము సూచిస్తుందని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఒక్కసారిగా కలలో చాలా పాములు కనిపిస్తే మాత్రం దానిని అశుభమని తెలియజేస్తోంది.

Share this post with your friends