
శ్రీకృష్ణ జన్మాష్టమికి పెద్దగా సమయం లేదు. మరో ఐదు రోజులే సమయం ఉంది. ఈ నెల 26న జరుపుకోనున్నాం. హిందువులు తమ ఇంట్లో బాల గోపాలుడిని ప్రతిష్టించుకుని పూజిస్తారు. జన్మాష్టమి సందర్భంగా కన్నయ్య అందంగా అలంకంచి వివిధ రకాల నైవేద్యాలను సమర్పిస్తారు. అయితే రాశి ప్రకారం లడ్డూ గోపాల్‌ని అలంకరిస్తే ప్రయోజనం మరింత ప్రభావవంతంగా ఉంటుందని పండితులు సూచిస్తున్నారు. శ్రీకృష్ణుని అలంకారానికి ఏ రాశి వారు ఏ రంగు వస్త్రాలను ఉపయోగించాలో చూద్దాం.
మేష రాశి: ఈ రాశి వారు బాల గోపాలుడిని ఎరుపు రంగు దుస్తులతో అలంకరిస్తే ఫలితం అద్భుతంగా ఉంటుంది.
వృషభ రాశి: ఈ రాశి వారు కన్నయ్యను వెండి వస్తువులతో అలంకరించాలట.
మిథునరాశి: ఈ రాశి వారు లడ్డూ గోపాల్‌ని లహరియ ముద్రిత దుస్తులతో అలంకరించాలట.
కర్కాటక రాశి: ఈ రాశి వారు కన్నయ్యను తెల్లటి రంగు దుస్తులతో అలంకరించాలి.
సింహ రాశి: ఈ రాశి వారు శ్రీకృష్ణుడిని గులాబీ రంగు దుస్తులతో అలంకంచాలి.
కన్యా రాశి: ఈ రాశి వారు లడ్డూ గోపాలాన్ని ఆకుపచ్చని వస్త్రాలతో అలంకరించవచ్చు.
తులారాశి: ఈ రాశి వారు శ్రీ కృష్ణుడిని కుంకుమ రంగు వస్త్రాలతో అలంకరించాలి.
వృశ్చిక రాశి: ఈ రాశి వారు కన్నయ్యను ఎరుపు రంగు దుస్తులతో అలంకరించాలి.
ధనుస్సు రాశి: ఈ రాశి వారు పసుపు రంగు దుస్తులతో బాలగోపాలుడిని అలంకరించాలి.
మకర రాశి: ఈ రాశి వారు కన్నయ్యను పసుపు, ఎరుపు రంగుల దుస్తులతో అలంకరించాలి.
కుంభ రాశి: ఈ రాశి వారు లడ్డూ గోపాలుడిని అలంకరించేందుకు నీలం రంగు దుస్తులను ఉపయోగించాలి.
మీన రాశి: ఈ రాశి వారు కన్నయ్యను పసుపు రంగు దుస్తులతో అలంకరించాలి.
