దత్తాత్రేయుడు తల్లికి శీరం చీల్చి ఇచ్చిన కథ గురించి తెలుసా?

శ్రీ దత్తాత్రేయ స్వామిని త్రిమూర్తి స్వరూపంగా భావిస్తారు. దత్తుడిని పరీక్షమూర్తిగా సైతం పిలుస్తారు. అంటే భక్తులకు కఠినమైన పరీక్షలు పెడతాడట. అనంతరం వారి పాపాలను పోగొడుతాడని చెబుతారు. అత్రి మహర్షి ధర్మపత్ని అనసూయ పాతివ్రత్యాన్ని గుర్తించింది కూడా దత్తాత్రేయుడేనని చెబుతారు. లక్ష్మి, సరస్వతి, పార్వతిలు అసూయతో ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని తమ భర్తలను అత్రి మహర్షి ఆశ్రమానికి పంపుతారు. వారు వెళ్లి విచిత్రమైన షరతు పెట్టి అనసూయ వారిని పసిపాపలుగా మార్చివేస్తుంది. అప్పుడు జరిగింది తెలుసుకున్న లక్ష్మి, సరస్వతి, పార్వతిలు ఆమెను వేడుకుంటారు. వారి విన్నపం మేరకు త్రిమూర్తులకు నిజస్వరూపం వస్తుంది.

అనసూయ దంపతుల కోరిక మేరకు త్రిమూర్తుల అంశతో వారికి జన్మించిన వరపుత్రుడే దత్తాత్రేయుడు. దత్తాత్రేయుడు చిన్నప్పటి నుంచి ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఎప్పుడూ ధ్యానంలోనే నిమగ్నమై ఉండేవాడు. ఈ దత్తుడు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తించేవాడు. ఒకసారి ప్రశాంత మనోహరమైన యతి రూపం ధరిస్తే.. మరోసారి ఆగ్రహంతో భయానక రూపంలో చిందులు తొక్కుతూ భక్తులను భయబ్రాంతులకు గురిచేసేవాడు.
ఆయన నిత్యం కల్పవృక్షం నీడలో నాలుగు కుక్కలను వెంటబెట్టుకుని ఉండేవాడు. వాటిని నాలుగు వేదాలుగా పేర్కొంటారు. ధర్మప్రబోధమే ధ్యేయంగా సహ్యాద్రి పర్వత శ్రేణుల్లో యోగ సాధనలో ఉంటూ భక్తులను సదా రక్షించే కరుణామూర్తి దత్తాత్రేయుడు. తల్లికి తన చర్మాన్ని చీల్చి ఇచ్చాడట. దత్తాత్రేయుడు బాల్యంలో సన్యసించి ఇల్లు విడిచి వెళ్తుండగా పుత్ర ప్రేమతో అతని తల్లి అతడిని వారించిందట. ‘నేను ఇచ్చిన శరీరం నీది’ అంటూ అడ్డుకుందట. ఆ మాటకు దత్తాత్రేయుడు తన గోళ్లతో చర్మాన్ని చీల్చి తల్లి చేతిలో పెట్టి ఆమె అజ్ఞానాన్ని పోగొట్టాడని చెబుతారు.

Share this post with your friends