ముని ఒక్క చూపుతో మారిపోయిన బోయవాడి కథేంటో తెలుసా?

హిందూమత విశ్వాసం ప్రకారం సత్యం పలకడం అనేది మనం నిర్వర్తించే అన్ని ధర్మాల కన్నా ప్రధానమైనది. ఒక్క సత్యాన్ని నమ్ముకుంటే చాలు పురాణాల ప్రకారం ఏదైనా సాధించగలం. ఈ విషయాన్ని తెలియజెప్పే ఒక కథ ఉంది. ఒక మునిని చూసి మారిపోయిన బోయవాని కథ. పూర్వం అరుణి అనే ముని దేవకీ నదీ తీరంలో నియమ నిష్టలతో ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఆయన తెల్లవారుజామునే నదీ స్నానం చేయడానికని తన వస్తువులన్నీ నది ఒడ్డున పెట్టి నదిలోకి దిగేందుకు వెళ్లబోతున్నాడట. ఆ సమయంలో వేటగాడు వచ్చి ఆ దుస్తులు, దండ కమండలాలు ఇవ్వాలని మునిని బెదిరించాడట.

అప్పుడు బోయవాని వైపు ముని తదేకంగా చూడటంతో మహా తపశ్శాలి అయిన ఆ ముని కరుణాపూరితమైన చూపులతో వేటగాడిలోని క్రూరత్వం నశించి దయ, జాలి వంటివి పుట్టుకొచ్చాయట. వెంటనే తన చేతిలోని ముని వస్తువులను కింద పడేసి.. వెంటనే మునికి భక్తితో నమస్కరించాడట. ముని కన్నుల్లోని మహత్తు తనలోని హింసా ప్రవృత్తిని నాశనం చేసిందని చెప్పాడు. తాను ఇక మీదట హింసా ప్రవృత్తిని వీడి భూత దయతో మెలుగుతానని చెప్పాడు. తనకు మంత్రోపదేశం చేయమని అర్థించగా.. ముని మౌనంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయినా సరే.. మునిని వదలకుండా ఆయన వెంటే ఉంటూ ఆయనకు సపర్యలు చేస్తూ ఉండిపోయాడు.

Share this post with your friends