గురు ప్రదోష వ్రతాన్ని చేస్తే ఫలితం ఎలా ఉంటుందో తెలుసా?

హిందూ ధర్మ శాస్త్ర ప్రకారం నెలకు రెండు సార్లు వచ్చే ప్రదోష వ్రతం గురించి మీకు తెలుసా? శుక్ల పక్షం, కృష్ణ పక్షంలో వచ్చే త్రయోదశి తిథి నాడు ప్రదోషం వస్తుంది. ముఖ్యంగా సూర్యాస్తమయం తర్వాత కనీసం 2.30 గంటల సమయం పాటు త్రయోదశి తిథి ఉంటుందో ఆ రోజు సాయంత్రం సమయాన్ని ప్రదోష సమయంగా చెబుతారు. ఈ రోజున శివారాధన చేస్తే చాలా మంచిదట. అలాగే ఈ రోజున వ్రతమాచరించిన వారికి చాలా మంచి జరుగుతుందని నమ్మకం. వారాన్ని బట్టి ప్రదోషం పేరు అనేది మారుతూ ఉంటుంది. ఈ సారి ప్రదోషం గురువారం రావడం వలన గురు ప్రదోషం అని పిలుస్తున్నారు.

ఇక ఇవాల సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల మధ్య ప్రదోష పూజ చేసుకోవచ్చు. శివపార్వతులిద్దరినీ పూజిస్తే మనం కోరుకున్న కోరికలు తప్పక నెరవేరుతాయని నమ్మకం. ఆర్థిక కష్టాలు ఏమైనా ఉన్నా.. వివాహం కాకున్నా అన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారట. ఇవాళ అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష చేస్తారు. పసుపు రంగు పూలతో శివపార్వతులను పూజించి ప్రసాదాలను సైతం పసుపు రంగువే నైవేద్యంగా సమర్పించాలి. శివాష్టకం చదివితే చాలా మంచిది. ఇక సాయంత్రం వేళ శివాలయానికి వెళ్లి నువ్వుల నూనెతో దీపం వెలిగించి అభిషేకం చేయాలి. ప్రదోష కథను వినడమో.. చదువుకోవడమో చేస్తే మంచిది. శివ పంచాక్షరీ మంత్రాన్ని 108 సార్లు చదివాలి.

Share this post with your friends