సిందూరం నుదుటన పెట్టుకోవడానికి కారణమేంటో తెలుసా?

మహిళలు సిందూరం నుదుటున ఎందుకు పెట్టుకుంటారు? అనేది ఇటీవల జరిగిన ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత మరింత వైరల్ అవుతోంది. పహల్గాంలో మహిళల సిందూరాన్ని చెరిపేసిన ఉగ్రవాదులకు ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత బద్రతా బలగాలు గట్టిగానే బుద్ది చెప్పాయి. దీంతో సిందూరం ఏమిటనే చర్చ జరగుతోంది. హిందూ సంప్రదాయంలో మహిళలు కనుబొమ్మల మధ్య, అలాగే జుట్టు పాపిడిలో సిందూరం పెట్టుకుంటారు. నవగ్రహాలలో అంగారకుడు, సూర్యుడు ఈ ఎరుపురంగుని సూచిస్తారు. ఇది శుభానికి సంకేతం మాత్రమే కాకుండా ధైర్యానికి చిహ్నం.

మనిషి దేహంలో నుదురు అనేది చాలా శక్తివంతమైనది. త్రినేత్రం అక్కడే ఉంటుంది. పైగా ఈ రెండు కనుబొమ్మల మధ్య ఉండే ప్రాంతాన్ని దుర్గాదేవి నివాసంగా కూడా చెబుతారు. అలాగే ఈ స్థానం శరీరం మొత్తాన్ని శక్తివంతం చేస్తుందట. అలాగే ఇక్కడే ఆజ్ఞ చక్రం ఉండటంతో మనం నుదుటి మధ్యలో కుంకుమను పెట్టుకుంటున్నప్పుడు వేలితో సున్నితంగా నొక్కినా కూడా శక్తి ప్రవహిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అందుకే హిందూ సంప్రదాయంలో స్త్రీ, పురుషులంతా కుంకుమను ధరిస్తారు. అలాగే ఈ స్థానానికి ఆకర్షించే శక్తి సైతం ఉంటుందట.

Share this post with your friends