
పునరాచమన మంత్రాల గురించి చాలా వరకూ తెలుసుకున్నాం కదా. మరికొన్ని మంత్రాల గురించి.. వాటి భావం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఓం ప్రద్యుమ్నాయ నమః: తేజో రూపునకు నమస్కారం
ఓం అనిరుద్దాయ నమః: ఎవరూ జయించలేని దైవానికి నమస్కారం
ఓం పురుషోత్తమాయ నమః: ఉత్తమ దైవానికి నమస్కారం.
ఓం అధోక్షజాయ నమః: భూమి ఆకాశం మధ్యవున్న దైవానికి నమస్కారం
ఓం నారసింహాయ నమః: నర+సింహ రూపంలో ఉన్న దైవానికి నమస్కారం
ఓం అచ్యుతాయ నమః: నశించని దైవానికి నమస్కారం
ఓం జనార్దనాయ నమః: జనులు మేలు కోరి పూజించే దైవానికి నమస్కారం
ఓం ఉపేంద్రాయ నమః: ఉప+ఇంద్ర = ఉపేంద్ర ఇంద్రియ నిగ్రహాన్ని పెంచే శక్తికి నమస్కారం
ఓం హరయే నమః: ప్రళయాన అంతా విష్ణువుకు నమస్కారం
ఓం శ్రీకృష్ణాయ నమః: అంతా ఆకర్షించు చల్లనిదైవానికి నమస్కారం
