
మనం ఏ పూజను అయినా ముందుగా ఆచమనం చేసి ప్రారంభిస్తాం. అసలు పురాణాచమన మంత్రాల అర్థమేంటో తెలియకుండానే చేస్తుంటాం. వాటి అర్థమేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓం కేశవాయ స్వాహా: కేసి అనే రాక్షసుని చంపిన క్లేశములను హరించు దైవానికి నమస్కారం
ఓం నారాయణాయ స్వాహా: చుట్టూ నీటి మధ్యలో ఉన్న దైవానికి నమస్కారం
ఓం మాధవాయ స్వాహా: మాధవి (లక్ష్మీదేవి) భర్తకు నమస్కారం
ఓం గోవిందాయ నమ: గోవులను రక్షించు దైవానికి నమస్కారం
ఓం విష్ణవే నమః: విశ్వమంతా నిండిఉన్న దైవానికి నమస్కారం
ఓం మధుసూదనాయ నమః మధు అనే రాక్షసుని చంపిన దైవానికి నమస్కారం
ఓం త్రివిక్రమాయ నమః: ముల్లోకాలను ఆక్రమించిన దైవానికి నమస్కారం
ఓం వామనాయ నమః: వామన అవతార రూప దైవానికి నమస్కారం
ఓం శ్రీధరాయ నమః: లక్ష్మీదేవిని వక్షస్థలాన ధరించిన దైవానికి నమస్కారం
ఓం హృషీకేశాయ నమః: ఇంద్రియాల అధిపతి దైవానికి నమస్కారం
ఓం పద్మనాభాయ నమః: నాభిలో పద్మం కలిగిన దైవానికి నమస్కారం
ఓం దామోదరాయ నమః: కడుపు చుట్టూ తాడు, కడుపులో లోకాలున్న దైవానికి నమస్కారం
ఓం సంకర్షణాయ నమః: ప్రళయాన అన్నీ ఆకర్షించి మింగే దైవానికి నమస్కారం
ఓం వాసుదేవాయ నమః: వసుదేవ సుతునికి నమస్కారం
