వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?

శ్రావణ మాసంలో తప్పని సరిగా అంతా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. ఈ వ్రతానికి అత్యంత విశిష్టత ఉంది కాబట్టి దీనిని ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ ఉంటారు. శ్రావణ మాసంలో పౌర్ణమి తిథి కంటే ముందు వచ్చే శుక్రవారం రోజున ఈ వ్రతాన్ని మహిళలంతా ఆచరిస్తూ ఉంటారు. ఈ లెక్కన ఈ ఏడాది ఆగస్ట్ 16వ తేదీన అంతా వ్రతం జరుపుకోనున్నారు. వీలు పడని వారు ఎవరైనా ఉంటే మరో శుక్రవారం జరుపుకుంటారు. ఇక వరలక్ష్మీ వ్రత ప్రాధాన్యత ఏంటనేది చూద్దాం.

సంపద- శ్రేయస్సు: ఈ వ్రతాన్ని ఆచరిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందట. దీంతో ఇంట్లో సిరి సంపదలు పెరుగుతాయి.

ఆనందం- శాంతి: ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల కుటుంబంలో సంతోషం నెలకొంటుందట. అలాగే కుటుంబంలో శాంతి, కుటుంబ సభ్యుల మధ్య అనురాగం పెరుగుతుందట.

అఖండ సౌభాగ్యం కోసం: వ్రతం ఆచరించే స్త్రీలు ఈ రోజున ఉపవాసం ఉంటే స్త్రీలు అఖండ సౌభాగ్యాన్ని పొందుతారు.

సంతానం: ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారి పిల్లలు ఆరోగ్యంగా, సంతోషకరమైన జీవితాన్ని పొందుతారట. సంతానం లేని మహిళలకు కూడా ఈ వ్రత మహత్స్యం కారణంగా సంతానం కలుగుతుందని నమ్మకం.

పేదరికం దూరం: ఈ వ్రత ప్రభావంతో ఇంట్లో పేదరికం తొలగిపోయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందట..

Share this post with your friends