వినాయక చవితికి చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అసలు వినాయక చవితి వస్తోందంటేనే పల్లెలు, పట్టణాలు, నగరాలన్న తేడా లేకుండా సందడి వాతావరణం నెలకొంటుంది. ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలోని శుక్ల పక్షం చతుర్థి తిథి నుంచి వరుసగా 10 రోజుల పాటు వినాయక ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుంటారు. ఈ ఏడాది 7 వ తేదీన వినాయకచవితిని దేశమంతా జరుపుకోనుంది. వినాయక చవితి సందర్భంగా దేశవ్యాప్తంగా సంతోషకరమైన వాతావరణం నెలకొంది. తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక ప్రాంతాల్లో ఈ పండుగను పెద్ద ఎత్తున జరుపుకుంటూ ఉంటారు. అయితే మనం ఇంటికి తెచ్చుకునే విగ్రహం విషయానికి వస్తే చాలా విషయాలను మనం గుర్తుంచుకోవాలి.
వినాయక విగ్రహం విషయంలో మనం గుర్తుంచుకోవల్సినవేంటంటే..
ముందుగా వినాయకుడి విగ్రహం ఎత్తు. ఇంట్లో ప్రతిష్టించాలనుకుంటే మాత్రం ఆరు అంగుళాలకు మించకూడదు.
ఇంట్లో ఇష్టానుసారంగా విగ్రహాలను ప్రతిష్టించకూడదు. ఒక విగ్రహం అది కూడా తొండం ఎడమ వైపునకు తిరిగి ఉన్నదైతే ఉపయోగకరం.
మనం తీసుకొచ్చిన విగ్రహం రంగును బట్టి దాని ఉంచే ప్రదేశం ఆధారపడి ఉంటుంది.
ఆకుపచ్చ గణేష్ విగ్రహాన్ని ఉత్తర దిశలో ప్రతిష్టించాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయట.
మట్టి రంగు గణేష్ విగ్రహాన్ని ఈశాన్య దిశలో ప్రతిష్టిస్తే.. మానసిక ఒత్తిడి, శారీరక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
నారింజ రంగు వినాయకుడి విగ్రహాన్ని దక్షిణ లేదా ఆగ్నేయ దిశలో ప్రతిష్టిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుందట.
తెలుపు రంగు గణేషుడిని వాయువ్య దిశలో ప్రతిష్టిస్తే.. జీవితంలో సంతోషం, శాంతి నెలకొంటాయట.
నలుపు రంగు విగ్రహం అసలు ఇంటికి తీసుకు రానే తీసుకురావద్దట.