పాండవుల కోసం దుర్యోధనుడిని శ్రీకృష్ణుడు అడిగిన ఐదూళ్లేంటో తెలుసా?

పాండవుల అజ్ఞాత వాసం ముగిసిన తర్వాత వారి తరుఫున రాయబారిగా శ్రీకృష్ణ పరమాత్ముడు కౌరవుల వద్దకు వెళ్లిన విషయం తెలిసిందే. పాండవుల జీవనోపాధి కోసం ఐదూళ్లివ్వమని అడిగాడు. దీనికి కూడా కౌరవులు అంగీకరించలేదు. ఇంతకీ ఆ ఐదూళ్లు ఏంటి? ప్రస్తుతం అవి ఎక్కడున్నాయో తెలుసుకుందాం. పాండవుల కోసం కన్నయ్య అడిగిన ఐదూళ్లలో మొదటిది ఇంద్రప్రస్థం. దీనిని శ్రీపత్ అని కూడా పిలుస్తారు. ప్రస్తుతం దీనిని ఢిల్లీ అని పిలుస్తున్నారు. వాస్తవానికి దీనిని నిర్మించింది పాండవులే. అక్కడ నేటికీ ఒక పాత కోట ఉంటుంది. దాని స్థానంలోనే ఇంద్రప్రస్థం ఉండేదని చెబుతారు. ఇక రెండోది బాగ్‌పత్. దీనిని వ్యాఘ్రప్రస్థ అని కూడా పిలిచేవారు. అంటే పులులు నివసించే ప్రదేశమని. ఇక్కడే కౌరవులు లక్షగృహాన్ని నిర్మించి పాండవులను సజీవ దహనం చేసేందుకు ప్లాన్ చేశారు.

మూడోది పానిపట్. దీనిని పాండుప్రస్థ అని కూడా పిలుస్తారు. ఢిల్లీకి 90 కిలోమీటర్ల దూరంలో ఉత్తరప్రదేశ్‌లో ఉన్న పానిపట్‌ను ప్రస్తుతం ‘సిటీ ఆఫ్ వీవర్’ లేదా ‘వీవర్స్ నగరం’ అని కూడా పిలుస్తారు. ఈ పానిపట్‌కు 70 కి.మీ దూరంలో కురుక్షేత్ర సంగ్రామం జరిగిందట. నాలుగవది తిలపట్ లేదా తిల్పత్. గతంలో దీనిని తిల్ ప్రస్థ అని కూడా పిలిచేవారు. ఇది హర్యానాలోని ఫరీదాబాద్ జిల్లాలో యమునా నది ఒడ్డున ఉంది. ఇక ఐదవది.. సోనిపట్ సోనిపట్. దీనిని గతంలో స్వర్ణప్రస్థ అని పిలిచేవారు. ఆ తరువాత కాలక్రమంలో సన్ ప్రస్థగానూ.. ఆ తరువాత సోనిపట్‌గా మార్చబడింది. స్వర్ణ మార్గం అంటే బంగారు నగరం. ప్రస్తుతం ఈ గ్రామం హర్యానా రాష్ట్రంలో ఉంది.

Share this post with your friends