బంగారం, నెయ్యి, వస్త్ర దానం వలన కలిగే ప్రయోజనాలేంటో తెలుసా?

దశ దానాల్లో గోదానం, తిల దానం, భూదానం వలన కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. ఇప్పుడు మరికొన్ని దానాల గురించి తెలుసుకుందాం.

హిరణ్య (బంగారం) దానం: బ్రహ్మదేవుని గర్భం నుంచి పుట్టిన బంగారాన్ని దానం చేయడం వల్ల సమస్త కర్మల నుంచి విముక్తుడు అవుతాడు. ఈ దానంతో అగ్నిదేవుడు సంప్రీతుడై అగ్నిలోక ప్రాప్తిస్తాడు.

నెయ్యి దానం: ఆజ్యం అంటే ఆవు నెయ్యి. ఇది కామధేనువు పాల నుంచి ఉద్భవించింది. దీనిని యఙ్ఞ, యాగాదులందు సకల దేవతలకు ఆహారంగా హవిస్సు రూపంలో సమర్పిస్తారు. అంతటి పవిత్రమైన ఆజ్యాన్ని దానం చేయడం వల్ల సకల యఙ్ఞఫలం లభిస్తుంది. ఈ దానంతో ఇంద్రుడు సంప్రీతుడై, దాతకు ఇంద్రలోకప్రాప్తిని అనుగ్రహిస్తాడు.

వస్త్ర దానం: చలి నుంచి శరీరానికి రక్షణ కలిగించే వస్త్రం. కేవలం అలంకారినికే కాకుండా మాననాన్ని కూడా కాపాడుతుంది. అట్టి వస్త్రాలను దానం చేయడం వల్ల సర్వ దేవతలు సంతోషించి సకల శుభాలు కలగాలని దాతను దీవిస్తారు.

Share this post with your friends