
భారతదేశంలో దేవాలయాలు లేని రాష్ట్రమంటూ లేదు. ప్రతి రాష్ట్రంలోనూ వేలకొలదీ ఆలయాలున్నాయి. అయితే ఏ రాష్ట్రంలో అత్యధిక ఆలయాలున్నాయనేది ఇప్పటకే తెలుసుకున్నాం. తమిళనాడులో అత్యధికంగా ఆలయాలున్నాయి. రెండో రాష్ట్రం మహారాష్ట్ర. ఇక మూడు, నాలుగు స్థానాల్లో ఏ ఏ రాష్ట్రాలున్నాయి? అక్కడ ప్రముఖ ఆలయాలేంటో తెలుసుకుందాం. దేవాలయాల పరంగా మూడో స్తానంలో కర్ణాటక ఉంది. కర్ణాటకలో దాదాపు 61 వేల దేవాలయాలు ఉన్నాయి. వాటిలో శ్రీరంగపట్నం రంగనాథ స్వామి, శృంగేరి శారదా పీఠం, గోకర్ణం మహాబలేశ్వర్ తదితర ఆలయాలు ప్రఖ్యాతిగాంచాయి.
ఇక దేవాలయాల పరంగా పశ్చిమ బెంగాల్ నాలుగో స్థానంలో ఉంది. ఇక్కడ మొత్తంగా 53,500 దేవాలయాలు ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలు చాలా ఉన్నాయి. దక్షిణేశ్వర్ కాళీ దేవాలయం, కోల్కతాలోని కాళీఘాట్ కాళీ దేవాలయం, బేలూర్ మఠం, హౌరా, ఇస్కాన్ దేవాలయం, మాయాపూర్, నందికేశ్వరి ఆలయం సైంథియా, మదన్మోహన్ దేవాలయం, బిష్ణుపూర్, శ్రీ శ్రీ మాతృ మందిరం జయరాంబటి, తారకనాథ్ ఆలయం తారకేశ్వర్, డార్జిలింగ్ శాంతి పగోడా డార్జిలింగ్, బిర్లా దేవాలయం కోల్కతా, పరస్నాథ్ మందిరం కోల్కతా, మహాకాల్ దేవాలయం వంటి ఎన్నో ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి.
