శ్రీకృష్ణుడు, కుచేలుడి స్నేహం ఎలా కుదిరిందో తెలుసా?

శ్రీకృష్ణుడు, కుచేలుడు బాల్యమిత్రులు. కుచేలులని అసలు పేరు సుదాముడు. అతనొక నిరుపేద కావడంతో చిరిగిన దుస్తులతో తిరుగుతూ ఉండేవాడు. అందుకే సుదాముడిని కుచేలుడు అని పిలిచేవారు. ఇక శ్రీకృష్ణుడికి, కుచేలుడికి మధ్య స్నేహం ఎలా కుదిరిందంటే.. సాందీపుని వద్ద శ్రీకృష్ణుడు విద్యను అభ్యసించేవాడు. కుచేలుడు కూడా అక్కడే చదువుకునేవాడు. సాందీపుని ఆశ్రమంలోనే వీరిద్దరికీ స్నేహం కుదిరింది. వీరిద్దరూ మంచి మిత్రులుగా కూడా అక్కడే పేరు తెచ్చుకున్నారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక ఎవరికి వారు వేరయ్యారు. శ్రీకృష్ణుడు ద్వారకాకు వెళ్లగా కుచేలుడు తన స్వగ్రామానికి వెళ్లిపోయాడు.

అలా శ్రీకృష్ణుడు, కుచేలుడు ఎవరికి వారైపోయి.. ఎవరి జీవితంలో వారు బిజీ అయిపోయారు. సుదాముడికి కొంతకాలానికి వివాహం జరుగుతుంది. స్వతహాగా సుదామడు అల్ప సంతోషి పైగా ధనార్జనపై ఏమాత్రం ఆశ ఉండేది కాదు. దీంతో ఆయన రమ భాగవతోత్తముడిగా గృహస్థాశ్రమం నియమాలను పాటిస్తూ జీవించసాగాడు. సుదామునికి తగ్గట్టే భార్య కూడా దొరికింది. ఆమె కూడా చాలా ఉత్తమురాలు. అత్యాశలకు పోకుండా ఉన్నంతలోల సంసారాన్ని నెట్టుకొస్తూ ఉండేది. ఆ తరువాత కుచేలునికి బహు సంతానం కలగడంతో అతని కుటుంబం మరింత దారిద్ర్యంలోకి వెళ్లిపోయింది. బయట పడేందుకే కుచేలుడు తిరిగి శ్రీకృష్ణుడి వద్దకు వెళతాడు.

Share this post with your friends