బ్రహ్మ కమలానికి హిందూమతంలో విశిష్టస్థానం ఉంది. ఇది హిమాలయాల్లో వికసిస్తుంది. ఈ బ్రహ్మ కమలాన్ని ఉత్తరాఖండ్ రాష్ట్రం తమ రాష్ట్ర పుష్పంగా చేసుకుంది. ఈ మొక్కకు 4500 ఏళ్ల నాటి చరిత్ర ఉందని చెబుతారు. బ్రహ్మం కమలం నక్షత్రాన్ని పోలి ఉంటుంది. ఈ పుష్పం తెల్లని తామరను పోలి ఉండటమే కాకుండా సువాసనను వెదజల్లుతూ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఈ పుష్పం రాత్రి సమయంలో పూస్తుంది. తెల్లవారేపాటికి వాడిపోతుంది.
ఇళ్లలో మొక్కను పెంచుకునేందుకు వాస్తు నియమాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఈ పుష్పం పౌర్ణమి నాటి రాత్రి వికసిస్తుంది. అసలు ఈ మొక్క ఎలా జీవం పోసుకుందో ముందుగా తెలుసుకుందాం. ఏనుగు తలతో గణేశుడు తిరిగి జీవం పోసుకున్న తర్వాత బ్రహ్మ దేవుడు కన్నీళ్ల జారి పడి ఈ మొక్క జీవం పోసుకుందట. అలా జీవం పోసుకున్న మొక్క ఏడాదికోమారు పుష్పాలను ఇస్తుంటుంది. ఈ పుష్పానికి ఆధ్యాత్మికంగా విశిష్ట స్థానం ఉంది కాబట్టే కేదార్‌నాథ్‌లోని శివునికి, బద్రీనాథ్‌లో విష్ణువుకు ఈ పుష్పాన్ని సమర్పిస్తారు.