బిర్యానీ ఆకుల గురించి మాంసాహార ప్రియులందరికీ తెలుసు. ఇది మాంసాహారానికి స్పెషల్ ఫ్లేవర్‌ను యాడ్ చేస్తుంది. వాస్తు శాస్త్ర ప్రకారం ఈ బిర్యానీ ఆకులకు ప్రత్యేక ప్రాముఖ్యత అయితే ఉంది. ప్రతిరోజూ రాత్రి పూట మన ఇంట్లో రెండు బిర్యానీ ఆకులను కాలిస్తే చాలా అద్భుతాలు జరుగుతాయట. మన జీవితంలో ఎన్నో సమస్యలు తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఇంట్లో కాస్త నెగిటివిటి ఉన్నా కూడా అది తొలగి పోతుందట. అలాగే చాలా సమస్యలకు ఇలా బిర్యానీ ఆకులను కాలిస్తే చెక్ పెడుతుందట.
ఇలా రాత్రి వేళ బిర్యానీ ఆకులను కాల్చితే.. ఇంట్లో మానసిక ఒత్తిడి అనేదే ఉండదట. మన ఒత్తిడిని పూర్తిగా తగ్గించేస్తుందట. మీ కుటుంబ సభ్యులు తరచుగా అనారోగ్యానికి గురైనా కూడా ఇది మంత్రంలా పని చేస్తుందట. అనారోగ్యం బారి నుంచి బయట పడేస్తుందట. ఇక రాత్రి పూట రెండు బిర్యానీ ఆకులను ఇంట్లో కాల్చితే ఇంట్లోని వారికి పీడకలలనేవే ఉండవట. మానసిక ఆరోగ్యమే కాదు.. శరీరక ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుందట. పైగా ఇంటికి ఏమైనా వాస్తు దోషాలనున్న అవి కూడా పోతాయట.