అష్టాదశ శక్తిపీఠాలను ఎలా ధ్యానించాలో తెలుసా?

అష్టాదశ శక్తిపీఠాల ధ్యానమును ఏవరైతే ప్రతిరోజు పఠిస్తారో వారికి సకల పాపములు నశించి, అష్టైశ్వర్యములు, ఆయురారోగ్యములు, సర్వ సిద్ధులు, సకల శుభాలు కలుగును. అష్టాదశ శక్తి పీఠాలలో ఒక్కొక్కరిని ఎలా ధ్యానించాలో ముందుగా తెలుసుకుందాం.

1. శాంకరీ దేవి (#ట్రింకోమలి) :
శ్రీ సతి శాంకరీ దేవి త్రింకోమలి పురస్థితా !
ఉత్తమాంగ ప్రభాగౌరీ భక్తకామ ఫలప్రదా !!

2. శ్రీ కామాక్షీ దేవి (#కంచి) :
కాంచీపురాశ్రితే దేవి కామాక్షీ సర్వమంగళా !
చింతాతన్మాత్ర సంతుష్టా చింతితార్థ ఫల ప్రదా !!

3. శ్రీ శృంఖలాదేవి (#ప్రద్యుమ్నం) :
ప్రద్యుమ్నే వంగ రాజ్యాయాం శృఖలా నామ భూషితే !
విశ్వవిమోహితే దేవీ శృంఖలా బంధనాశనీ !!

4. శ్రీ చాముండేశ్వరీ దేవి (#మైసూరు) :
క్రౌంచపుర స్థితా మాతా చాముండా దుష్టనాశనీ !
సర్వసిద్ధి ప్రదాదేవీ భక్తపాలన దీక్షితా !!

5. శ్రీ జోగులాంబ దేవి (#ఆలంపురం) :
జోగులాంబ మహాదేవీ రౌద్ర వీక్షణ లోచన !
అలంపురీ స్థతా మాతా సర్వార్థ ఫల సిద్థిదా !!

6. శ్రీ భ్రమరాంబా దేవి (#శ్రీశైలం) :
శివపార్శ్వస్థితా మాతా శ్రీ శైలే శుభ పీఠకే !
భ్రమరాంబా మహాదేవీ కరుణారస వీక్షణా !!

7. శ్రీ మహాలక్ష్మీ దేవీ (#కొల్హపూర్) :
మహాలక్ష్మ్యభిదా దేవీ కరవీర పుర స్థితా !
పురుషార్థ ప్రదామాతా మహాశక్తి మాహుగ్రామ !!

8. శ్రీ ఏకవీరా దేవి (#నాందేడ్) :
ఏకవీరా మహాశక్తి మాహుగ్రామ గుహాస్థితా !
పురుషార్థ ప్రదామాతా సంపూర్ణామృత వర్షిణీ !!

9. శ్రీ మహాకాళీ దేవి (#ఉజ్జయిని) :
ఉజ్జయిన్యాం మహాకాళీ మహాకాళేశ్వరీ!
క్షిప్రా తీరస్థితామాతా వాంఛితార్థ ప్రదాయిని !!

10. శ్రీ పురుహూతికా దేవి (#పిఠాపురం) :
పురుహూతీ సతీమాతా పీఠికాపుర సంస్థితా !
పుత్రవత్పాలితా దేవీ భక్తానుగ్రహ దాయినీ !!

11. శ్రీ గిరిజా దేవి (#కటక్) :
ఓఢ్రదేశే భువనేశీ గిరిజానామ సంస్థితా !
పాలికాఖిల లోకానాం పల్లవారుణ పాణినా !!

12. శ్రీ మాణిక్యాంబా దేవి (#ద్రాక్షారామం) :
దక్షావాటీస్థితా శక్తీః విఖ్యాతా మాణిక్యాంబికా !
వరదా శుభదాదేవీ భక్తమోక్ష ప్రదాయిని !!

13. శ్రీ కామరూపిణీ దేవి (#గౌహతి) :
కామరూపిణి విఖ్యాతా హరిక్షేత్రే సనాతనీ !
యోనిముద్రాత్రిఖండేశీ మాసే మాసే నిదర్శితా !!

14. శ్రీ మధావేశ్వరీ దేవి (#ప్రయాగ) :
మాధవేశ్వరీ మాంగళ్య ప్రయాగ స్థల వాసినీ !
త్రివేణీ సంగమే తీరే భుక్తి ముక్తి ప్రదాయినీ !!

15. శ్రీ వైష్ణవీ దేవి (#జ్వాలాకేతం) :
తుహినాద్రి స్థితా మాతా జ్వాలా ముఖీవిశ్రుతా !
జ్వాలా మాలా ప్రభాదేవీ జ్ఞాన వైరాగ్య వర్థినీ !!

16. శ్రీ మాంగల్య గౌరీదేవి (#గయ) :
సర్వ మంగళ మాంగళ్యా గయా మాంగల్య గౌరికా !
అర్థదా మోక్షదాదేవీ అక్షయ్య ఫలప్రదాయినీ !!

17. శ్రీ విశాలాక్షీ దేవి (#వారణాసి) :
విశాలాక్షీదేవి విఖ్యాత వారణాస్యాం శివాంతికే !
నిరతాన్న ప్రదాత్రీచ నిర్భగ్య జనతోషిణీ !!

18. శ్రీ సరస్వతీ దేవి (#జమ్మూకాశ్మీర్) :
జ్ఞాన ప్రదా సతీమాతా కాశ్మీరేతు సరస్వతీ !
మహావిద్యా మహామాయా భుక్తి ముక్తి ప్రదాయినీ !!

Share this post with your friends