ఆంజనేయ స్వామి చాలా పవర్ ఫుల్ గాడ్ అని అందరికీ తెలిసిందే. ఏదైనా భయంలో ఉన్నా.. మనకు శక్తి కావాలన్నా ఆయనను పూజించుకుంటూ ఉంటాం. ఇక మంగళవారం వస్తే చాలా మంది తప్పక హనుమాన్ చాలీసా పారాయణం చేస్తుంటారు. హనుమాన్ చాలీసా ఎక్కడ పుట్టింది? ఎవరు రాశారు అనేది చాలా మందికి తెలియదు. హనుమాన్ చాలీసాను రామ భక్తుడైన తులసీదాస్ రాశాడని అంటుంటారు. తులసీదాస్‌ను ఒకసారి అక్బర్ చక్రవర్తి.. చెరసాలలో వేయించాడట. ఆ తరువాత లక్షలాది కోతులు ఏకకాలంలో ఆగ్రాలోని ఎర్రకోటపై దాడి చేసి హంగామా సృష్టించాయట.
తరువాతి రోజు అసలేమంది? సడెన్‌గా ఎందుకు ఇన్ని కోతులు వచ్చి దాడి చేశాయని బీర్బల్‌ను అక్బర్ చక్రవర్తి అడగ్గా.. దానికి తులసీదాస్‌ను చెరసాలలో బంధించడమే దీనికి కారణమని చెప్పారట. దీంతో తన తప్పు తెలుసుకున్న అక్బర్ వెంటనే తులసీదాస్‌ను చెరసాల నుంచి బయటకు తీసుకొచ్చారట. ఆ సమయంలో తులసీదాస్ మాట్లాడుతూ చెరసాలలో ఉన్నప్పుడు తాను శ్రీరాముడితో పాటు హనుమంతుడిని ప్రార్థిస్తుండటా.. తన చేతులు అలవోకగా ఏవో శ్లోకాలను రాశాయని.. తాను వాటిని హనుమంతుడికి అంకితమిచ్చినట్టు తెలిపారు. తాను రాసిన 40 శ్లోకాలను చదివిన వారిని కష్టం నుంచి.. ఆపదల నుంచి బయటపడేస్తాయని తులసీదాస్ చెప్పాడు. అదే హనుమాన్ చాలీసా. ఇది చదివితే హనుమంతుడి అనుగ్రహం మనకు లభించి కష్టాల నుంచి బయటపడతామని నమ్మకం.