144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహా కుంభమేళాకు పెద్ద ఎత్తున నాగసాధువులు తరలి వస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ ప్రత్యేకతతో అందరి చూపును తమ వైపునకు తిప్పుకుంటున్నారు. ఒక సాధువు ఏళ్ల తరబడి ఒక చేతిని పైకెత్తి ఉంచుతూ.. మరో సాధువు ఏళ్ల తరబడి 1.25 లక్షల రుద్రాక్షలను ధరించి వార్తల్లో నిలిచారు. అయితే మహా కుంభమేళాకు హాజరయ్యే నాగ సాధవులు గడ్డకట్టే చలిని సైతం తట్టుకోగలుగుతారు. హిమాలయాల్లో సైతం తపస్సు చేసుకుంటూ ఉంటారు. అసలు అంతటి చలిని వారెలా తట్టుకుంటారో తెలుసుకున్నాం. వారు కొన్ని రకాల సాధనలు చేస్తారని చెప్పుకున్నాం కదా.
శంకరాచార్యుడు నాలుగు మఠాలను స్థాపించారట. అయితే వాటి భద్రత విషయంలో ఆయన చాలా ఆందోళన చెందారట. ఈ క్రమంలోనే వాటి రక్షణ కోసం నాగ సాధువుల బృందాలను ఏర్పాటు చేశారని చెబుతారు. అన్ని రుతువులను తట్టుకోవడానికి నాగ సాధువులు ఈ 3 రకాల సాధనలను చేస్తారు. అవేంటో తెలుసుకుందాం.
నాడీ శోధన : ప్రాణాయామం ద్వారా నాగసాధువులు తమ శరీరంలోని గాలి ప్రవాహాన్ని సమతుల్యం చేసి తద్వారా శరీర ఉష్ణోగ్రతను కాలానికి అనుగుణంగా తయారు చేసుకుంటారు.
అగ్ని సాధన: నాగ సాధువులు తమ శరీరంలోని అగ్ని మూలకాన్ని ప్రేరేపించేందుకు అగ్నిసాధన చేస్తారు. తద్వారా వారి శరీరంలో అంతర్గత వేడి ఉత్పన్నమై కఠినమైన పరిస్థితులను తట్టుకునేలా వారిని వెచ్చగా ఉంచుతుంది. వారి శరీరాలను కఠినమైన పరిస్థితుల్లో కూడా వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది.
మంత్ర పఠనం : నాగసాధువులు నిరంతరం ధ్యానంలోనే గడుపుతుంటారు. మంత్రాలను పఠిస్తూ ఉంటారు. ఆ మంత్ర ప్రభావం వారి శరీరంలో దివ్యమైన పాజిటివ్ శక్తిని పెంపొందించి వారి శరీరాన్ని బయట ఉష్ణోగ్రతలను తట్టుకునేలా చేస్తుంది.
విభూతి యోగం : నాగ సాధువులు వారి శరీరమంతా విభూదిని రాసుకుంటారు. ఆ విభూతిలో ఉండే కాల్షియం, ఫాస్పరస్, పొటాషియం వంటి ఖనిజాలు శరీర ఉష్ణోగ్రతను నియంత్రించి చలి నుంచి కాపాడతాయి.